TVS రోనిన్ vs బజాజ్ అవెంజర్.. ఈ రెండు బైకుల్లో ఏదీ బెస్ట్ !
భారత మార్కెట్లో టీవీఎస్ రోనిన్, బజాజ్ అవెంజర్ బైకులకు మంచి క్రేజ్ ఉంది. ఈ రెండు మోడల్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ రెండు బైకులు విభిన్నమైన డిజైన్లు కలిగి ఉన్నాయి. ఈ రెండు బైక్ లను పొల్చి చూస్తే ఎందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాబాజ్ అవెంజర్ 220 పెద్ద విండ్ షీల్డ్, సింగిల్ పీస్ సీట్, ఫార్వార్డ్ ఫుట్ పెగెలతో అకర్షణీయంగా ఉంది. మరోవైపు రోనిన్ డిజైన్ మాత్రం కాస్త విభిన్నంగా ఉంటూ సరికొత్త లుక్ తో దర్శనమిస్తోంది.మస్కులర్ ఫ్యుయల్ ట్యాంక్, నియో రెట్రో డిజైన్ఎలిమెంట్ లను కలిగి ఉంది. టీవీఎస్ రోనిన్ బైక్ 225.9 cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ను కలిగి ఉంది.
టీవీఎస్ రోనిన్ లో ఎక్కువ ఫీచర్లు
అవేంజర్ 220 బైక్ 220 cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ను కలిగి ఉంది. టీవీఎస్ అవెంజర్ 220 బైక్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంటల్ క్లస్టర్, స్పోక్ రిమ్స్, ఎల్ ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ లను కలిగి ఉంది. మరోవైపు టీవీఎస్ రోనిన్ బైక్ ఎక్కువ ఫీచర్లతో వచ్చింది. బ్లూటూత్ కనెక్టివిటీ, ఆల్ ఎల్ఈడీ లైటింగ్, అలాయ్ వీల్ తో సరికొత్తగా ముందుకొచ్చింది. బజార్ అవెంజర్ ధర రూ.1.38 లక్షలుగా ఉంది. టీవీఎస్ రోనిన్ బైక్ ధర రూ.1.49 లక్షల నుంచి రూ.1.69 లక్షల మధ్య ఉంది. అవెంజర్ కన్నా రొనిన్ ధర కాస్త ఎక్కువైనా ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంది.