బాబర్ గా మారిన బజాబ్ అవెంజర్ 220 .. బైక్ అదిరింది బాసు!
బాబర్ అవెంజర్ 220 బాబార్ గా మారింది. నీవ్ మోటర్ సైకిల్స్, అవెంజర్ 220కి సరికొత్త మార్పులు బైక్ ని మరింత అద్బుతంగా తీర్చిద్దిదారు. బజాబ్ అవెంజర్ 220ని నీవ్ మోటర్ సైకిల్స్ మాడిఫై చేసింది. దీనిని ఆటమ్ అని పిలుస్తోంది. బ్లాంక్ అండ్ గ్రే పెయింట్ థీమ్ స్ట్రైలిష్ తో కొత్తగా వస్తోంది. చాలా భాగాలకు జింక్, క్రోమ్ ప్లేట్ వేసి పాలిష్ చేశారు. ఎల్ఈడీ లైటింగ్ ను కూడా సరికొత్తగా అమర్చారు. సాధారణంగా ఉండేఎల్ ఈడీ లైట్లను బ్రాండ్ న్యూ హెడ్ లైట్, టర్న్ ఇండికేటర్లతో రిప్లేస్ చేయడం విశేషం. సింగిల్ పీస్ సీట్ రావడం ప్రత్యేకత.
బజాబ్ అవెంజర్ 220లో సరికొత్తగా ఎగ్సస్ట్ సిస్టెమ్
కస్టమ్ రేర్ సీట్ ని అమర్చారు. అసరమైతే దానిని తీసేయవచ్చు. స్టాక్ స్పీడోమీటర్ డిజిటల్ యూనిట్ తో రిప్లేస్ చేయడం విశేషం. టైర్ హాగర్, గ్రిప్ కూడా న్యూ లుక్ తో వచ్చాయి. బాబర్ లుక్ ను సంపూర్ణ చేసేందుకు బార్ ఎండ్ మిర్రర్లను కూడా అమర్చారు. హ్యండిల్ బార్ కూడా ఎంతో అకర్షణీయంగా అమర్చారు. బైక్ లో 140/95-ఆర్ 15 టైర్ ఫ్రెంట్ అండ్ రేర్ లో వచ్చాయి. ఇందులో ఇంజిన్ మాత్రం మార్చలేదు. కాగా ఎగ్సాస్ట్ సిస్టెమ్ ను మాత్రం కొత్తగా మార్చారు.