Maruti Suzuki Alto K10: బడ్జెట్ కారులో హై సేఫ్టీ! ఆల్టో K10 అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
మారుతి సుజుకి ఆల్టో K10 ఇప్పుడు ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో మరింత సురక్షితంగా మారింది.
ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 4.23 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 6.21 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
అయితే మారుతీ సుజుకీ ఇందులో ఎటువంటి యాంత్రిక లేదా సౌందర్యపరమైన మార్పులు చేయలేదు.
బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యంత భద్రతతో కూడిన కారును కోరుకునే వారికి ఆల్టో K10 ఒక మంచి ఎంపికగా మారనుంది.
Details
మారుతి సుజుకి ఆల్టో K10 కొత్త భద్రతా ఫీచర్లు
ఈ మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రియర్ పార్కింగ్ సెన్సార్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (EBD), త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌లు వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకి ఆల్టో K10 ఇంజిన్
మారుతి సుజుకి ఆల్టో K10 ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది 998cc, త్రీ-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది.
ఈ ఇంజిన్ 65bhp పవర్ (5,500 rpm వద్ద), 89Nm టార్క్ (3,500 rpm వద్ద) ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ AMT తో లభిస్తుంది.
Details
అందుబాటులో సీఎన్జీ వేరియంట్
CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, కానీ CNG మోడల్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లేదు. CNG లో ఈ ఇంజిన్ 55bhp పవర్ (5,300 rpm వద్ద), 82.1Nm టార్క్ (3,400 rpm వద్ద) ఉత్పత్తి చేస్తుంది.
ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.
మారుతి సుజుకి బ్రెజ్జాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు
మారుతీ సుజుకీ బ్రెజ్జా మోడల్‌కి 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ మోడల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్-షోరూమ్).
LXI వేరియంట్ రూ. 15,000, VXI వేరియంట్ రూ. 5,500, ZXI వేరియంట్ రూ. 11,500 పెరిగింది.
అయితే టాప్-ఎండ్ ZXI+ వేరియంట్ ధర మాత్రం పెరగలేదు.
Details
బ్రెజ్జాలో అదనపు ఫీచర్లు
బ్రెజ్జా అన్ని వేరియంట్లలో త్రీ-పాయింట్ రియర్ సెంటర్ సీట్‌బెల్ట్‌లు, సర్దుబాటు చేయగల సీట్‌బెల్ట్‌లు, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, కప్ హోల్డర్‌లతో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, సర్దుబాటు చేయగల రియర్ హెడ్‌రెస్ట్‌లు వంటి అదనపు భద్రతా ఫీచర్లు అందించారు.
ఈ అప్‌డేట్‌తో మారుతి సుజుకి బడ్జెట్ కార్లను మాత్రమే కాకుండా SUV లను కూడా మరింత భద్రతతో అందుబాటులోకి తెస్తోంది.