Loading...
Honda Hybrid Vehicle Plant: హోండా భారీ ప్లాన్‌.. అమెరికాలో 3 బిలియన్ డాలర్లతో హైబ్రిడ్‌ ప్లాంట్
హోండా భారీ ప్లాన్‌.. అమెరికాలో 3 బిలియన్ డాలర్లతో హైబ్రిడ్‌ ప్లాంట్

Honda Hybrid Vehicle Plant: హోండా భారీ ప్లాన్‌.. అమెరికాలో 3 బిలియన్ డాలర్లతో హైబ్రిడ్‌ ప్లాంట్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 11, 2026
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో హోండా తన ఆటో మొబైల్‌ వ్యూహాన్ని మరింత వేగంగా మార్చుకుంటోంది. ఒహియోలో కొత్త హైబ్రిడ్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు ఏకంగా $3 బిలియన్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌తో దాదాపు 2,000 ఉద్యోగాలు వస్తాయి. 2029లో ఉత్పత్తి ప్రారంభమైతే ఏడాదికి 2.40 లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంటుంది. దీంతో అమెరికాలో హోండా మొత్తం వాహన ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 13 లక్షలకు, ఉత్తర అమెరికా సామర్థ్యం 19 లక్షలకు చేరుతుంది.

Details

కెనడాలోనూ భారీ పెట్టుబడి

అమెరికాతో పాటు కెనడాలోనూ హోండా పెట్టుబడులను పెంచుతోంది. కెనడియన్‌ కార్యకలాపాల కోసం C$867 మిలియన్లు కేటాయించింది.

ఇందులో ఒంటారియోలోని అల్లిస్టన్‌ ప్లాంట్‌కు C$166 మిలియన్లు వెచ్చించనుంది.

అక్కడ పనిచేస్తున్న సుమారు 4,000 మంది ఉద్యోగుల ఉపాధిని కొనసాగించనుంది. అల్లిస్టన్‌ ప్రాజెక్ట్‌కు కెనడా ప్రభుత్వం కూడా C$313 మిలియన్లు పెట్టుబడి పెడుతోంది.

Details

హైబ్రిడ్‌ వైపు హోండా అడుగులు

ఎలక్ట్రిక్‌ వాహనాలపై గతంలో ప్రకటించిన కొన్ని లక్ష్యాలను హోండా ఇప్పుడు సవరించింది.

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కొత్త Honda, Acura హైబ్రిడ్‌ మోడళ్లను తీసుకురావాలని నిర్ణయించింది.

అలబామాలో కొత్త V6 హైబ్రిడ్‌ ఇంజిన్‌ తయారీకి పెట్టుబడి పెట్టనుంది. ఒహియోలోని ఇంజిన్‌, ట్రాన్స్‌మిషన్‌ ప్లాంట్లను కూడా ఆధునీకరిస్తోంది.

ADVERTISEMENT

Details

టారిఫ్‌ల నేపథ్యంలో కొత్త వ్యూహం

అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో విదేశీ వాహన తయారీ సంస్థలు స్థానిక ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నాయి.

ఇదే దిశలో హోండా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆడి కూడా జార్జియాలో $4 బిలియన్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

అమెరికాలో తయారీ పెంచడం ద్వారా టారిఫ్‌ భారం తగ్గించుకోవడంతో పాటు స్థానిక మార్కెట్‌కు దగ్గరగా ఉత్పత్తిని నిర్వహించాలన్నది కంపెనీల వ్యూహంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT