Page Loader
Honda CB300F: హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్.. భారతదేశంలో ధర రూ. 1.70 లక్షలు
హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్.. భారతదేశంలో ధర రూ. 1.70 లక్షలు

Honda CB300F: హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్.. భారతదేశంలో ధర రూ. 1.70 లక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

'హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా' తమ తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ బైక్‌ను మార్కెట్లో లాంచ్‌ చేసింది, దీనికి CB300F అని పేరు పెట్టింది. ఇది భారతదేశంలో మొదటి ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ మోటార్‌సైకిల్‌గా గుర్తింపు పొందింది. ఈ బైక్‌ ప్రారంభ ధరను కంపెనీ రూ. 1.70 లక్షలుగా(ఎక్స్‌-షోరూమ్‌)నిర్ణయించింది. ఇది రెండు ఆకర్షణీయమైన రంగులైన స్పోర్ట్స్‌ రెడ్‌, మ్యాట్‌ యాక్సిస్ గ్రే మెటాలిక్‌లో లభ్యమవుతుంది. ఈ హోండా ఫ్లెక్స్‌ ఫ్యూయెల్ బైక్‌ బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. అక్టోబర్‌ చివరి వారం నుంచి ఈ బైక్‌లు హోండా బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. 293.52సీసీ సామర్థ్యం కలిగిన, 4 స్ట్రోక్‌, సింగిల్‌ సిలిండర్‌ పీజీఎం-ఎఫ్‌ఐ ఇంజిన్‌ ఆధారంగా ఈ బైక్‌ రూపొందించబడింది.

వివరాలు 

ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ మోటార్‌ సైకిల్‌ కంపెనీకి ఒక సరికొత్త మైలురాయి

ఇది 18.3 kW శక్తిని, 25.9 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.ఈబైక్‌ సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, అసిస్టెంట్‌ స్లిప్‌ క్లచ్‌ వంటి ఫీచర్లతో వస్తోంది. అదనంగా,రెండు డిస్క్‌ బ్రేకులు,డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌తో కూడి ఉన్న ఈ మోడల్‌ వినియోగదారులకు సురక్షితమైన డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది. హోండా కంపెనీ ఎండీ,సీఈఓ సుత్సుము ఒటాని ఈ బైక్‌ ఆవిష్కరణపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ మోటార్‌ సైకిల్‌ కంపెనీకి ఒక సరికొత్త మైలురాయిని సూచిస్తుందన్నారు. ఉద్గారాలను తగ్గించేందుకు హోండా ఈ బైక్‌ను అభివృద్ధి చేసింది.ఫ్లెక్స్‌ ఫ్యూయెల్ అనేది ఒకటి కంటే ఎక్కువ ఇంధన మిశ్రమాలతో నడిచే ఇంధనాన్ని సూచిస్తుంది. సాధారణంగా పెట్రోల్‌,ఇథనాల్‌ లేదా మిథనాల్‌ మిశ్రమంతో ఈ బైక్‌లు నడుస్తాయి.