Loading...
Honda CB500: హోండా CB500 బైక్‌ విడుదల.. భారత మార్కెట్లో ధర ఎంతంటే?
హోండా CB500 బైక్‌ విడుదల.. భారత మార్కెట్లో ధర ఎంతంటే?

Honda CB500: హోండా CB500 బైక్‌ విడుదల.. భారత మార్కెట్లో ధర ఎంతంటే?

వ్రాసిన వారు Balachander Sharma
Nov 24, 2026
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో హోండా కొత్త CB500 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.75 లక్షలుగా నిర్ణయించింది. ఒకప్పుడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 500సీసీ UCE మోడళ్లతో ఉన్న ఈ విభాగంలో 2020 తర్వాత పెద్ద గ్యాప్‌ ఏర్పడింది. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేలా హోండా ఈ కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న CB500కు బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. 2026 చివరి నాటికి డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది.

Details

501సీసీ ఇంజిన్‌.. 43.3Nm టార్క్

ఈ బైక్‌లో కొత్తగా రూపొందించిన 501సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌, ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను అమర్చారు.

ఇది 5,250rpm వద్ద 28hp పవర్‌, 3,750rpm వద్ద 43.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్లో హోండా అందిస్తున్న అతిపెద్ద ఎయిర్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ మోటార్‌సైకిల్‌ ఇదే.

ఐదు గేర్లతో పాటు స్లిప్‌ అండ్‌ అసిస్ట్‌ క్లచ్‌ ఇచ్చారు. ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల చక్రాలు ఉన్నాయి.

రెండు వైపులా డిస్క్‌ బ్రేకులు, డ్యూయల్‌ ఛానల్‌ ABS భద్రతను అందిస్తాయి.

Details

మూడు వేరియంట్లు.. ధరలు ఇలా

CB500ను అల్లాయ్‌, స్పోక్‌, టాప్‌ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. బేస్‌ అల్లాయ్‌ మోడల్‌ ధర రూ.2.75 లక్షలు.

స్పోక్‌ వేరియంట్‌ రూ.3 లక్షలకు లభిస్తుంది. ఇందులో క్రాస్‌ స్పోక్‌ ట్యూబ్‌లెస్‌ రిమ్స్‌ ప్రత్యేకత.

టాప్‌ వేరియంట్‌ ధర రూ.3.02 లక్షలు. ఇందులో ప్రత్యేక రంగులు, గ్రాఫిక్స్‌ అందించారు.

అన్ని మోడళ్లలో హోండా సెలెక్టబుల్‌ టార్క్‌ కంట్రోల్‌, అనలాగ్‌-డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, హోండా రోడ్‌సింక్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ADVERTISEMENT

Details

సిటీ రైడింగ్‌, లాంగ్‌ జర్నీలకు అనువుగా

హోండా CB500 బరువు 189 కిలోలు. ఈ విభాగంలోని CB350 (181 కిలోలు), రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 (195 కిలోలు)తో పోలిస్తే మధ్యస్థ బరువుతో ఉంది. 168 మి.మీ.

గ్రౌండ్‌ క్లియరెన్స్‌ భారత రహదారులపై ఉపయోగకరంగా ఉంటుంది. ముందు టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, వెనుక ప్రీలోడ్‌ అడ్జస్టబుల్‌ గ్యాస్‌ ఛార్జ్డ్‌ ట్విన్‌ షాక్‌ అబ్జార్బర్లు ఉన్నాయి.

19 అంగుళాల ముందు చక్రం రోడ్‌స్టర్‌ తరహా రూపానికి తోడ్పడుతుంది. క్లాసిక్‌ డిజైన్‌తో పాటు ఆధునిక ఫీచర్లు కోరుకునే బైక్‌ ప్రియులకు ఇది మరో ఎంపికగా నిలవనుంది.

ADVERTISEMENT