హోండా CR-V హైబ్రిడ్ స్పోర్ట్-L వేరియంట్ విడుదల.. ఫీచర్లు ఇవే!
హోండా CR-V హైబ్రిడ్ స్పోర్ట్-L ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. US మార్కెట్‌లో ప్రస్తుత హోండా CR-V ధర కంటే ఈ వేరియంట్ రూ.90 వేలు కంటే ఎక్కువగానే ఉంది. ఈ కొత్త వేరియంట్ లో చాలా అప్‌డేట్‌తో ముందుకొస్తోంది. ఈ వాహనం భారతీయ మార్కెట్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంతవరకూ కంపెనీ స్పష్టం చేయలేదు. హోండా CR-V హైబ్రిడ్ స్పోర్ట్-L వేరియంట్ ఫీచర్ల గురించి మనం తెలుసుకుందాం. ఈ వెహికల్‌లో ఫ్రంట్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌లను అందిస్తుంది. ముఖ్యంగా స్పోర్ట్-ఎల్ వేరియంట్ గ్లోస్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ట్రిమ్, దీర్ఘచతురస్రాకార ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు ఉండనున్నాయి. క్యాబిన్‌లో లెదర్ సీట్లు ఉన్నాయి.
హోండా CR-V వెహికల్ లో అదనపు ఫీచర్లు
పవర్డ్ టెయిల్‌గేట్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కోసం వైర్‌లెస్ సపోర్ట్‌తో కూడిన తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, ఇతర ఫీచర్లు ఉండనున్నాయి. అదే విధంగా రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో కూడిన 2.0-లీటర్ నాలుగు సిలిండర్‌లు ఉన్నాయి. ఇది 204 హార్స్ పవర్ ఇస్తుంది ఇది 190 hp గరిష్ట శక్తిని,179 lb-ft గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఎంపికను పొందుతుంది. ఈ వాహనం భారత మార్కెట్లో అమ్మకాల పరంగా ఎక్కువ అదరణ పొందలేదు. ఈ వెహికల్ సూమారుగా రూ.25 లక్షల నుండి 33.61 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.