Page Loader
హోండా డియో హెచ్ స్మార్ట్ వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ సూపర్బ్
హోండా డియో హెచ్​ స్మార్ట్​

హోండా డియో హెచ్ స్మార్ట్ వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ సూపర్బ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2023
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన కొత్త వేరియంంట్ డియో స్మార్ట్ స్కూటర్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 'డియో' మోడల్‌కు కూడా హెచ్ స్మార్ట్ టచ్ ఇచ్చింది. దీని ఎక్స్ షో రూం ధర 77,712గా ఉంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న డియోకు టాప్ ఎండ్ వేరియంట్ అడుగుపెట్టడం విశేషం. సరికొత్త డియోకు సంబంధించి హోండా సంస్థ ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది. ఇందులో యాక్టివా హెచ్ స్మార్ట్ లోని ఫీచర్స్ ఇందులోనూ ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో అలాయ్ వీల్స్, ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ టైర్స్, స్మార్ట్ కీ వంటివి ఇందులో ఉండొచ్చు.

Details

హోండా డియో వేరియంట్లపై రూ.1500 పెంపు 

ఎస్‌టీడీ ఓబీడీ 2 వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.70,211, డీఎల్ఎక్స్ ఓబీడీ2 వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 74,212గా ఉంది. హోండా డియో హెచ్ స్మార్ట్‌లో ఎల్ఈడీ డైటైమ్ రన్నింగ్ ల్యాంప్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఫ్రెంట్ పాకెట్, అండర్ సీట్ స్టోరేజ్ తో రానుంది. ఇది 7.65 బీహెచ్​పీ పవర్​ను, 9 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. హోండా కొత్త డియో స్కూటర్ ఫీచర్ల గురించి కంపెనీ ఇంకా పూర్తిస్థాయిలో వివరాలను వెల్లడించలేదు. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న హోండా డియో వేరియంట్ల ధరలను రూ. 1,500 కంటే ఎక్కువ పెంచుతున్నట్లు తెలిపింది.