అద్భుతమైన ఫీచర్లతో వచ్చేసిన హోండా ఎలివేట్ ఎస్‌యూవీ.. ధర ఎంతంటే?
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా సరికొత్త ఎలివేట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. హోండా ఎలివేట్ ఎస్‌యూవీ కారు ముందుగా భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఎలివేట్ హోండా సిటీ, హోండా అమేజ్ తర్వాత ఈ వెహికల్ రానుంది. దీని లుక్స్ డాషింగ్‌గా ఉన్నాయి. ఫ్రెంట్‌లో పెద్ద రేడియేటర్ గ్రిల్ రానుంది. ఫ్లాట్ ఫేస్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ల్యాంప్ హోజింగ్, అలాయ్ వల్స్ వంటివి వస్తున్నాయి. ఈ వెహికల్లో 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ హెచ్‌డీకలర్ టీఎఫ్ టీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, వయర్ లెస్ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ వంటివి ఉండనున్నాయి.
హోండా ఎలివేట్ ప్రారంభ ధర రూ.10.50 లక్షలు
హోండా ఎలివేట్ లో 1.5 లీటర్ డీఓహెచ్సీ, ఐ వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది 121 పీఎస్ పవర్‌ను, 145.1 ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేయనుంది. సెల్ఫ్ ఛార్జింగ్, డ్యూయెల్ మోటర్ ఈ సీవీటి టెక్నాలజీ కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ కూడా ఈ ఎస్‌యూవీకి లభించనుంది. దీని పోడవు 4312 ఎంఎ, వెడల్పు 1,790 ఎంఎం, ఎత్తు 1650 ఎంఎం ఉండనుంది. ఇండియాలో ఈ ఎలివేట్ ఎస్‌యూవీ ధరకు సంబంధించిన వివరాలు లాంచ్ సమయంలో తెలియనున్నాయి. దీని ఎక్స్ షోరూం ధర రూ.10.50 లక్షలు నుండి 20 లక్షలు మధ్యలో ఉండనుంది. ఇండియాలో మరో మూడేళ్లలో ఒక ఫుల్లీ ఎలక్ట్రిక్ కారును సైతం లాంచ్ చేస్తున్నట్లు హోండా ప్రకటించింది.