Honda: కర్ణాటకలో హోండా ప్రత్యేకమైన రికార్డు.. 50 లక్షల వాహనాల విక్రయం
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కర్ణాటకలో కొత్త మైలురాయిని చేరుకుంది, అక్కడ 5 మిలియన్ (50 లక్షలు) ద్విచక్ర వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది. కర్ణాటకలో నివసిస్తున్న వినియోగదారులు హోండా వాహనాలను కొనుగోలు చేయడంలో ప్రాధాన్యత చూపిస్తున్నారు. దీని కారణంగా కంపెనీ కస్టమర్ సంతృప్తికి అత్యంత కట్టుబడి ఉంది. జూన్ 2001లో తమ కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి, హోండా వినియోగదారుల అవసరాలను తీర్చడానికి కృషి చేస్తోంది. సాంకేతికతను అప్‌డేట్ చేస్తూ మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లను అందిస్తున్నట్లు పేర్కొంది. హోండా యాక్టివా, షైన్ మోడల్స్ కర్ణాటకలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఇది కంపెనీ కస్టమర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ ఈ అంశంపై స్పందించారు.
కస్టమర్‌లకు కృతజ్ఞతలు యోగేష్ మాథుర్
హోండా బ్రాండ్‌పై విశ్వాసం ఉంచినందుకు, 5 మిలియన్ల మైలురాయిని చేరుకోవడానికి తమకు సహాయం చేసినందుకు కర్ణాటకలోని కస్టమర్‌లకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. తమ కస్టమర్‌ల నిరంతర మద్దతు, విశ్వాసం వెలకట్టలేనిదని తెలిపారు. హోండా ఉత్పత్తి శ్రేణిలో నాలుగు స్కూటర్ మోడల్స్ ఉన్నాయి. 110సీసీ విభాగంలో 9 మోడల్స్, 125సీసీ విభాగంలో డియో, యాక్టివా 125, మరియు డియో 125 ఉన్నాయి. మోటార్‌సైకిళ్లలో 100, 110సీసీ సెగ్మెంట్‌లో షైన్ 100, డీఆర్‌సీ డీలక్స్ 110ఎక్స్ అందుబాటులో ఉన్నాయి. 125సీసీ విభాగంలో షైన్ 125, ఎస్పీ125, 160సీసీ విభాగంలో యునికార్న్, ఎస్పీ160, 180-200సీసీ విభాగంలో హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్ వంటి మోడల్స్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.