స్టైలిస్ లుక్‌తో హోండా SC e స్కూటర్ వచ్చేసింది.. ఫీచర్లు సూపర్బ్!
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హోండా సరికొత్త స్కూటర్ ఆవిష్కరించింది. 2023 జపాన్ మొబిలిటి షోలో హోండా SC e స్కూటర్ ను లాంచ్ చేసింది. జపాన్‌లో "క్లాస్ 2 మోపెడ్"గా దీన్ని వర్గీకరించారు. స్టైలిస్ లుక్‌తో వినియోగదారులను ఈ స్కూటర్ ఆకర్షిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో ఇది సంచనాలను నమోదు చేస్తుందని ఆ సంస్థ భావిస్తోంది. షార్ప్ లైటింగ్ ఎలిమెంట్స్, స్మూత్ బాడీ ప్యానెల్స్‌తో దీన్ని డిజైన్‌ను ఆకర్షణీయంగా తీర్చదిద్దారు. ఇందులో సొగసైన బాడీ ప్యానెల్‌లు, ప్రీమియం సింగిల్-పీస్ సీటు, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, ఇంటిగ్రేటెడ్ సైడ్ స్టాండ్‌ను ప్రదర్శిస్తుంది.
ఫీచర్లను వెల్లడించిన సంస్థ
ఇందులో రెండు హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఇ: బ్యాటరీలు ఉండనున్నాయి. ఇది పట్టణవాసులకు అనుకూలంగా ఉండనుంది. ఈ వెహికల్ శబ్దం కూడా చాలా తక్కువగా ఉండనుంది. హోండా SC e స్కూటర్ ఫీచర్స్ వివరాలను హోండా సంస్థ ఇంకా అధికారంగా వెల్లడించారు. ఇది లిమిటెడ్ ఎడిషన్ స్కూటీగా సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో త్వరలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.