'ఎలివేట్' ఎస్‌యూవీ త్వరలో రివీల్.. ధ్రువీకరించిన హోండా..!
ఇండియాలో ఎస్‌యూవీ సెగ్మెంట్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను క్యాచ్ చేసుకునేందుకు ఆటో మొబైల్ సంస్థలు క్యూ కడుతున్నాయి. ప్రముఖ తయారీ సంస్థ హోండా 'ఎలివేట్' అనే ఓ కొత్త ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. వచ్చే నెల 6వ తేదీన హోండా ఎలివేట్ ను ఆవిష్కరించనున్నట్లు తాజాగా సంస్థ ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో ఎస్‌యూవీని పాక్షికంగా రివీల్ చేసింది ఈ ఎస్‌యూవీలో పానారోమిక్ సన్ రూఫ్ ఉండదని టీజర్ ద్వారా తెలుస్తోంది. రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటినా, బాడీ కలర్డ్ ఓఆర్‌వీఎంలు కూడా దర్శనమివ్వనున్నాయి. ముఖ్యంగా రేర్ లో ఎల్ఈడీ స్ట్రిప్ కనెక్టింగ్ టెయిల్ టైల్స్, ఎలివేట్ బ్యాడ్జింగ్ వంటివి రానున్నాయి.
ఎలివేట్ పై భారీ అంచనాలు పెట్టుకున్న హోండా
హోండా ఎలివేట్ కు చెందిన డిజైన్ ను గతంలో సంస్థ షేర్ చేసిన విషయం తెలిసిందే. సీఆర్-వీ మోడల్ ఆధారంగా ఈ ఎస్‌యూవీని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 16 ఇంచ్ మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ తో అకర్షణీయంగా వస్తోంది. ఈ ఎలివేట్ కు సంబంధించిన ఇతర వివరాలను హోండా సంస్థ ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. ఇందులో ఇండియా స్టాండర్డ్స్ కు తగ్గట్టు ఇందులో సరికొత్త ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. ఇది 120 బీహెచ్‌పీ పవర్ ను జనరేట్ చేయనుంది. ఈ ఎలివేట్ పై హోండా సంస్థ భారీ ఆశలనే పెట్టుకుంది.