భారతదేశంలో OXO మోడల్ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP
స్వదేశీ స్టార్ట్-అప్ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో OXO మోడల్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 1.4 లక్షలు (ఎక్స్-షోరూమ్). మోటార్‌సైకిల్ బేస్, ప్రో మోడల్స్ లో అందుబాటులో ఉంటుంది. తయారీ సంస్థ ఈ బైక్‌ను ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ ఈ-మోటార్ షోలో ప్రదర్శించింది. ప్రో ప్యాకేజీ కింద మొత్తం-ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఐదు రంగులలో ఆర్డర్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం అభివృద్ధి చెందుతోంది, వివిధ స్వదేశీ స్టార్ట్-అప్‌ల నుండి అనేక కొత్త ఆఫర్‌లు ఉన్నాయి. జైపూర్ ఆధారిత HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లో తన సత్తా చాటేందుకు OXO ఈ-బైక్ ను విడుదల చేసింది. LYF, LEO తర్వాత HOP నుండి వస్తున్న మూడవ ఉత్పత్తి.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150కిమీల వరకు నడుస్తుంది
మార్కెట్లో ఇది Revolt RV400, టోర్క్ క్రాటోస్‌లతో పోటీపడుతుంది. HOP OXO 3.75kWh లిథియం-అయాన్ బ్యాటరీ 5.2kW (బేస్) లేదా 6.2kW (Pro) BLDC హబ్-మౌంటెడ్ మోటార్ తో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150కిమీల వరకు ప్రయాణించవచ్చు. రైడర్ భద్రత కోసం HOP OXO ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS), మెరుగైన హ్యాండ్లింగ్ కోసం రీజెనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది. భారతదేశంలో, HOP OXO బేస్ మోడల్ ధర రూ. 1.4 లక్షలు, ప్రో మోడల్ ధర రూ. 1.67 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ను ఆన్‌లైన్‌లో లేదా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.