KTM 1290 Vs BMW R 1250 : ఈ రెండు బైక్స్ లో ఏది కొనాలి?
భారత మార్కెట్లో లేటెస్ట్‌గా కేటీఎం 1290 అడ్వెంచర్ 2024ను ఆవిష్కరించనుంది. గ్లోబెల్ మార్కెట్లో ఇప్పటికే దీనిపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ బైక్‌కు పోటీగా BMW R 1300 GS లాంచ్ అయ్యింది. లీటర్-క్లాస్ ADV విభాగంలో ఈ రెండు బైక్స్ పోటాపోటీగా నిలిచాయి. KTM 1290లో సూపర్ అడ్వెంచర్ అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, నకిల్ గార్డ్‌లతో ఎత్తైన హ్యాండిల్‌బార్, ఎక్స్‌టెన్షన్‌లతో కూడిన ఇంధన ట్యాంక్, మెటాలిక్ బాష్ ప్లేట్, సింగిల్-పీస్ సీటు, సొగసైన LED టైల్‌లైట్‌ను కలిగి ఉంది. BMW R 1300 GSలో X- ఆకారపు DRLలతో కూడిన LED హెడ్‌ల్యాంప్, ఎత్తైన హ్యాండిల్‌బార్, నిటారుగా ఉండే విండ్‌స్క్రీన్, స్ప్లిట్-టైప్ సీట్లు, 6.5-అంగుళాల పూర్తి-రంగు TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది.
BMW R 1300 GSలో అధునాతన ఫీచర్లు
రైడర్ల భద్రత కోసం ఈ రెండు బైకుల్లో రెండూ డ్యూయల్-ఛానల్ ABS, రైడ్-బై-వైర్ థొరెటల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్, ట్రాక్షన్ కంట్రోల్‌తో పాటు వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి. KTM 1290లో 1,301cc, లిక్విడ్-కూల్డ్, V-ట్విన్, LC8 ఇంజన్ ఉంది. ఇది 158hp గరిష్ట శక్తిని, 138Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. BMW R 1300 GSలో 1,300cc, ఎయిర్-అండ్-లిక్విడ్-కూల్డ్ ఉంది. ఇది 145hp గరిష్ట శక్తిని, 142Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. యూఎస్ మార్కెట్లో 2024 BMW R 1300 GS ప్రారంభ ధర సుమారుగా రూ. 15.74 లక్షలు ఉంది. మరోవైపు,. మరోవైపు, 1290 సూపర్ అడ్వెంచర్ ధరను KTM ఇంకా వెల్లడించలేదు.