Big Discounts: కార్లపై భారీ డిస్కౌంట్.. త్వరపడండి
కొత్త కారు కొనుగోలు చేసే వారికి శుభవార్త అందనుంది. కైగర్, క్విడ్, ట్రైబర్ తదితర కార్లపై ఈ జూన్ నెలలో భారీ డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. ముఖ్యంగా క్యాష్ డిస్కౌంట్స్, కార్పొరేట్ బోనస్, ఎక్సైంజ్ బోనస్, లాయల్టీ బోనస్ మొదలైనవి ఉన్నాయి. లాయల్టీ బోనస్ పొందడానికి కస్టమర్లు గతంలో రెనో కారును కొనుగోలు చేసి ఉంటేనే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. జూన్ 30వ తేదీ వరకూ ఈ డిసౌంట్స్ ఆఫర్స్ అందుబాటులో ఉండనున్నాయి. కార్ మోడల్, డీలర్ షిప్ లోకేషన్ బట్టి రెన్ ఇండియా రూ.65వేల వరకు డిస్కౌంట్ ను అందించనుంది. రనో కారును ఈ సమయంలో కొంటే మంచి డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.
కార్లపై ఆఫర్ల వివరాలు
క్విడ్ పై : రెనో క్విడ్ కారుపై గరిష్టంగా రూ.57వేలు డిస్కౌంట్ పొందొచ్చు. ఇందులో 15వేల క్యాష్ డిస్కౌంట్, రూ20వేల ఎక్సైంజ్ బోనస్, రూ.12వేల కార్పొరేట్ బోనస్, రూ.10 వేల లాయల్టీ బోనస్ లు లభించనున్నాయి. కైగర్ పై : రెనో కైగర్ కారుపై రూ.67వేలు డిస్కౌంట్ లభించనుంది. 25వేల క్యాస్ డిస్కౌంట్, రూ. 20 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ. 12 వేల కార్పొరేట్ బోనస్, రూ. 10 వేల లాయల్టీ బోనస్ ఉంటాయి. రెనో ట్రైబర్ పై : రెనో ట్రైబర్ కారుపై గరిష్టంగా 45వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో రూ. 15 వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 20 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ. 10 వేల లాయల్టీ బోనస్ ఉంటాయి.