OLA S1Z: పండగ సీజన్‌లో ఓలా EVపై భారీ డిస్కౌంట్.. రూ. 24 వేలు తగ్గింపు!
ఈ వార్తాకథనం ఏంటి
పండగ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు తమ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి.
సేల్స్‌ను పెంచుకునేందుకు అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
ఈ క్రమంలో ఓలా సంస్థ తమ S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 24 వేల డిస్కౌంట్‌ను ప్రకటించింది.
ఓలా ఈవీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిసి, పండగ సీజన్‌లో మరింత క్యాష్ చేసుకునేందుకు ఈ ఆఫర్ ను ప్రకటించింది.
ఈ ఆఫర్ 12 జనవరి నుండి 14 జనవరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే కేవలం మూడు రోజుల్లో ఈ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తారు.
Details
రెండు వేరియంట్లలో ఈ వెహికల్
. ఆఫర్‌లో భాగంగా ఓలా S1 మోడల్ రూ. 59,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది.
S1 శ్రేణిపై రూ. 24 వేల వరకు తగ్గింపు అందిస్తారు. ఇందులో ఉచిత ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ కూడా ఉంటుంది. S1 మోడల్ S1 Z, S1 Z+ రెండు వేరియంట్లలో ఈ వెహికల్ అందుబాటులో ఉంటుంది.
ఒకవేళ మీరు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకుంటే, ఈ ఆఫర్ పై ఓ లుక్కేయండి. ఓలా S1 Z మోడల్ 1.5kWh స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
ఇది సింగిల్ ఛార్జ్‌లో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదనపు బ్యాటరీ ప్యాక్ తో, ఈ వాహనం 146 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
Details
మే నెలలో డెలవరీలు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 75 కిలోమీటర్ల గంట వేగంతో రైడ్ చేయవచ్చు. S1 Z సింగిల్ పీస్ సీట్‌తో వస్తుంది.
ఇందులో ఇద్దరు ప్రయాణించవచ్చు. S1 Z+ మోడల్ కూడా అందుబాటులో ఉంది, ఇది సింగిల్ సీట్‌తో వస్తుంది. రియర్ లగేజీ క్యారియర్, ఫోన్ మౌంట్, ఫ్రంట్ లగేజీ క్యారియర్‌తో ఉంటుంది,
ఇది కమర్షియల్ యూజ్ కోసం కూడా అనువుగా ఉంటుంది. S1 Z ప్రారంభ ధర రూ. 59,999 మరియు S1 Z+ ప్రారంభ ధర రూ. 64,999. ఈ వాహనాలను బుక్ చేసుకోవడం కోసం ప్రారంభ ధర రూ. 499 మాత్రమే.
బుకింగ్ చేసిన వారికి 2025 మే నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.