హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు!
కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ సంస్థలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దేశంలో పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఆటో మొబైల్ సంస్థలు క్రేజీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమ పోర్ట్ పోలియోలోని పలు వాహనాలపై భారీ డిస్కౌంట్లను ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్స్ వెల్లడించింది. ఐ20, ఐ20 ఎన్ లైన్, గ్రాండ్ ఐ 10 నియోస్, ఆరా, అల్కరాజ్, కోనా ఎలక్ట్రిక్ వంటి మోడల్స్ పై ఆగస్టు నెలలో భారీ డిస్కౌంట్లను ఆ సంస్థ ప్రకటించింది. కోనా ఎలక్ట్రిక్ వాహనంపై హ్యుందాయ్ మోటర్స్ ఏకంగా 2 లక్షల వరకు డిస్కౌంట్ ను ఇస్తోంది.
ఐ20, ఐ20 ఎన్ లైన్ మోడల్స్ పై 40వేల వరకు తగ్గింపు
దేశంలో హ్యుందాయ్ సంస్థ నుంచి లాంచ్ అయిన తొలి ఈవీగా ఈ కోనా ఎలక్ట్రిక్ వెహికల్ గుర్తింపు పొందింది. ఈ కోనా ఎలక్ట్రిక్‌లో 39.2 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఐ20, ఐ20 ఎన్ లైన్ మోడల్స్ పై రూ.40వేల వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ వంటి బెనిఫిట్స్ కలుపుకొని రూ.40వేల వరకు తగ్గనుంది. హ్యుందాయ్ ఆరాకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. దీనిపై 33వేల వరకు డిస్కౌంట్ వర్తించనుంది. హ్యుందాయ్ అల్కజార్‌కు ఆగస్టులో రూ.20వేల వరకు డిస్కౌంట్ లభించనుంది.