Page Loader
Tata Electric Cars: టాటా EVలపై భారీ తగ్గింపు: రూ.1 లక్ష వరకు డిస్కౌంట్!
టాటా EVలపై భారీ తగ్గింపు: రూ.1 లక్ష వరకు డిస్కౌంట్!

Tata Electric Cars: టాటా EVలపై భారీ తగ్గింపు: రూ.1 లక్ష వరకు డిస్కౌంట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్ తమ పాపులర్ ఎలక్ట్రిక్ మోడళ్లైన టియాగో EV, పంచ్ EV, నెక్సాన్ EV, కర్వ్ EVలపై రూ.1 లక్ష వరకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్లు కూడా ఉండడం గమనార్హం. అయితే ఈ ఆఫర్లు జూన్ 30 లేదా స్టాక్ ఉన్నంతవరకే వర్తిస్తాయి.

Details

 కర్వ్ EVపై రూ.70,000 వరకు తగ్గింపు

టాటా కర్వ్ EVపై టాటా మోటార్స్ గరిష్టంగా రూ.70,000 వరకూ తగ్గింపును అందించడం విశేషం. ఇందులో రూ.50,000 గ్రీన్ బోనస్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌గా లభిస్తున్నట్లు తెలిసింది. ఈ మోడల్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో (45 kWh, 55 kWh) అందుబాటులో ఉంది. ధర రూ.17.49 లక్షల నుంచి రూ.22.24 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కొత్తగా డార్క్ ఎడిషన్ కూడా విడుదల చేశారు. ఇది మార్కెట్లో BE.06, హ్యుందాయ్ క్రెటా EV వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది.

Details

నెక్సాన్ EVపై రూ.40,000 తగ్గింపు

టాటా బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన నెక్సాన్ EVపై 2024 యూనిట్లకు గరిష్టంగా రూ.40,000 తగ్గింపునకు లభిస్తోంది. ఇందులో గ్రీన్ బోనస్ రూ.20,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 ఉన్నాయి. ఈ మోడల్‌లో 30 kWh, 45 kWh బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. పరిధి 275 కి.మీ (MIDC) నుంచి 489 కి.మీ వరకు ఉంటుంది. ధరలు రూ.12.49 లక్షల నుంచి రూ.17.19 లక్షల వరకు ఉన్నాయి. ఇది ఎంజీ కామ్, మహీంద్రా XUV400కి గట్టి పోటీగా నిలుస్తోంది.

Details

టియాగో EVపై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్లు

ఎంట్రీ లెవల్ టియాగో EVపై అత్యధిక డిస్కౌంట్లు ఉన్నాయి. బేస్ ఎక్స్ఈ వేరియంట్‌ పై రూ.55,000 బెనిఫిట్లు లభిస్తే, ఎక్స్‌జడ్+ వేరియంట్‌పై రూ.70,000 వరకూ తగ్గింపు ఉంది. మిడ్-లెవెల్ ఎక్స్‌టి ఎల్ఆర్ వేరియంట్‌పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ అందుతోంది. 2025 మోడళ్లకు మాత్రం రూ.40,000 ఫ్లాట్ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ మోడల్ రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య లభిస్తుంది. 19.2 kWh, 24 kWh బ్యాటరీ ఎంపికలతో 221 కి.మీ నుంచి 275 కి.మీ వరకు పరిధి కలిగి ఉంది.

Details

పంచ్ EVపై రూ.90,000 వరకూ తగ్గింపు 

పంచ్ EVలో కూడా వేరియంట్‌పై ఆధారపడి డిస్కౌంట్లు ఉన్నాయి. MY2024 లాంగ్ రేంజ్ ACFZ వేరియంట్‌లపై రూ.90,000 వరకూ తగ్గింపు ఉంది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్, స్మార్ట్ ప్లస్ వేరియంట్‌లకు రూ.45,000 వరకు, ఇతర వేరియంట్‌లకు రూ.70,000 వరకు లభిస్తోంది. కొత్త MY2025 మోడళ్లకు ఫ్లాట్ రూ.40,000 తగ్గింపు మాత్రమే వర్తిస్తుంది. ధరలు రూ.9.99 లక్షల నుంచి రూ.14.44 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇది Citroen eC3 వంటి కాంపాక్ట్ EVలతో పోటీపడుతోంది. క్లియరెన్స్ టార్గెట్ ఈ ఆఫర్లు ప్రధానంగా 2024 స్టాక్‌ను క్లియర్ చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. అయితే 2025 యూనిట్లపైనా పరిమిత ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ తగ్గింపులను వినియోగదారులు జూన్ 30 లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది.