EV project: ఏపీలో భారీ ఈవీ ప్రాజెక్ట్..రూ.515 కోట్లు పెట్టుబడి.. 5వేల మంది ఉపాధి!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. థండర్‌ప్లస్, ఈటీవో మోటార్స్, రోకిట్‌తో కలిసి రూ.515 కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 5,000కుపైగా ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 1,450 ప్రత్యక్ష ఉద్యోగాలు కాగా, 3,100 పరోక్ష ఉద్యోగాలు. ప్రత్యేకంగా మహిళలకు ఫ్లీట్ ఆపరేషన్స్, ఛార్జింగ్ స్టేషన్ నిర్వహణ, కస్టమర్ సపోర్ట్, మొబిలిటీ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నట్లు కన్సార్షియం హామీ ఇచ్చింది.
Details
రాష్ట్ర ఛార్జింగ్ ఇన్‌ఫ్రా నిర్మాణం థండర్‌ప్లస్‌కు బాధ్యత
కన్సార్షియంలో ప్రధాన భాగస్వామి థండర్‌ప్లస్ రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రతి 25 కిలోమీటర్లకూ 120kW ఛార్జర్లు ప్రతి 100 కిలోమీటర్లకూ 1MW అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం కంపెనీ విజయవాడలో 3MW సామర్థ్యంతో భారీ ఛార్జింగ్ హబ్‌ను, నల్లజర్ల, విశాఖపట్నంలో చిన్న సౌకర్యాలను నిర్వహిస్తోంది. రెండు క్లస్టర్లలో అమలు ప్రారంభం ప్రాజెక్ట్ ప్రాథమికంగా రెండు క్లస్టర్లలో అమలు కానుంది 1. అమరావతి క్యాపిటల్ రీజియన్ (గన్నవరం విమానాశ్రయం, విజయవాడ, అమరావతి, గుంటూరు)
Details
2. విశాఖపట్నం అర్బన్ రీజియన్
(ఎన్‌ఏడి జంక్షన్, పెందుర్తి, సింహాచలం, ద్వారకానగర్) ఈ ప్రాంతాల్లోనే మొదట రాష్ట్ర మల్టీ-మోడల్ ఈవీ షటిల్ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఒకే యాప్‌తో అన్ని రవాణా సేవలు - రోకిట్ కొత్త టికెటింగ్ సిస్టమ్ రవాణా వ్యవస్థ అంతటినీ ఒకే ప్లాట్‌ఫారమ్‌లో చేర్చే యూనిఫైడ్ డిజిటల్ టికెటింగ్ సిస్టమ్‌ను రోకిట్ రూపొందించనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను క్లిన్ మొబిలిటీ క్యాపిటల్‌గా తీర్చిదిద్దడంలో ఇది కీలక అడుగని థండర్‌ప్లస్ సీఈఓ రాజీవ్ వైఎస్‌ఆర్ తెలిపారు. రోజూ లక్షలాది మంది ప్రయాణించే కమ్యూట్‌ను మరింత సులభతరం చేసే సమగ్ర వ్యవస్థను నిర్మిస్తున్నామని ఈటీవో మోటార్స్ సీఈఓ నిర్మల్ రెడ్డి అన్నారు.