Page Loader
IMOTY అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350
IMOTY మోటార్‌సైకిల్‌కు లభించే అత్యున్నత పురస్కారం

IMOTY అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 13, 2023
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 2023కి IMOTY లేదా ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ గెలుచుకుంది. ఈ మోటార్‌సైకిల్ తనతో పోటీ పడిన మరో తొమ్మిది బ్రాండ్లను ఓడించి కిరీటాన్ని గెలుచుకుంది. 15 మంది సీనియర్ మోటార్‌సైకిల్ జర్నలిస్టుల బృందం ఈ బైక్‌ను అగ్రస్థానానికి ఎంపిక చేసింది. TVS రోనిన్, సుజుకి V-Strom SX మొదటి, రెండవ రన్నరప్‌గా నిలిచాయి. IMOTY భారతీయ మార్కెట్లో ఒక మోటార్‌సైకిల్‌కు లభించే అత్యున్నత పురస్కారం. గత సంవత్సరం ఆగస్టులో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 ప్రారంభమైనప్పటి నుండి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా మారింది. ఈ బైక్ కేవలం మూడు నెలల్లోనే 50,000 యూనిట్లు అమ్ముడుపోయింది.

బైక్

రైడర్ భద్రత కోసం ముందూ, వెనక చక్రాలలో డిస్క్ బ్రేకులు అమర్చారు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 విమర్శకుల ప్రశంసలు పొందిన J-సిరీస్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. 13-లీటర్ టియర్‌డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, రౌండ్ హెడ్‌ల్యాంప్ యూనిట్, ట్రిప్పర్ నావిగేషన్ యూనిట్‌తో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. దీనికి 20hp, 350cc J-సిరీస్ ఇంజన్ సపోర్ట్ ఉంది. మోటార్‌సైకిల్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను అమర్చారు. రైడర్ భద్రత కోసం ముందు, వెనుక చక్రంలో డిస్క్ బ్రేక్, దీనితో పాటు మెరుగైన రైడ్, హ్యాండ్లింగ్ సౌకర్యం కోసం సింగిల్-ఛానల్ లేదా డ్యూయల్-ఛానల్ ABSతో వస్తుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 బేస్ రెట్రో వేరియంట్ ధర రూ.1.5 లక్షలు, టాపింగ్ మెట్రో రెబెల్ మోడల్ ధర రూ. 1.72 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్).