Page Loader
భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సూపర్‌కార్‌ను కొనుగోలు చేసిన హైదరాబాదీ
ఏడాది క్రితం భారతీయ మార్కెట్లోకి అధికారిక ప్రవేశ ప్రకటన

భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సూపర్‌కార్‌ను కొనుగోలు చేసిన హైదరాబాదీ

వ్రాసిన వారు Nishkala Sathivada
Apr 03, 2023
06:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

లంబోర్ఘిని, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ వంటి బ్రాండ్‌లు దేశంలో అధికారికంగా తమ కార్లను అందిస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా, భారతీయ మార్కెట్ అధిక-పనితీరు గల ఇతర దేశ కార్లపై ఆసక్తిని పెంచుతోంది. ఈ జాబితాలో ఇప్పుడు మెక్‌లారెన్ కూడా చేరింది. ఇది ఒక సంవత్సరం క్రితం భారతీయ మార్కెట్లోకి అధికారిక ప్రవేశాన్ని ప్రకటించింది. ఇటీవలే ముంబైలో దాని మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ప్రారంభోత్సవ వేడుకలో, బ్రాండ్ తన ఫ్లాగ్‌షిప్ సూపర్‌కార్, మెక్‌లారెన్ 765 LTని ఆవిష్కరించింది. ఈమధ్యే ఈ కారు డెలివరీ తీసుకున్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త మెక్‌లారెన్ కు మొదటి కస్టమర్‌. మెక్‌లారెన్ 765 LT స్పైడర్‌ను ప్రదర్శించే వీడియో naseer_khan0054 ద్వారా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

కార్

మెక్‌లారెన్ ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన వేగవంతమైన కన్వర్టిబుల్‌లలో ఇది ఒకటి

నసీర్ ఖాన్ మెక్‌లారెన్ 765 ఎల్‌టి స్పైడర్‌ను కొనుగోలు చేయడం ద్వారా భారతదేశంలో ఈ మోడల్‌కు మొదటి కస్టమర్‌గా మారాడు. అతను MSO వోల్కానో రెడ్ షేడ్‌ని ఎంచుకున్నాడు, ఇది సూపర్‌కార్‌కు స్పోర్టి, స్టైలిష్ లుక్‌ని ఇస్తుంది. మెక్‌లారెన్ ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన వేగవంతమైన కన్వర్టిబుల్‌లలో ఇది ఒకటి. ఇది కన్వర్టిబుల్ వెర్షన్ కాబట్టి, పైకప్పు కేవలం 11 సెకన్లలో ముడుచుకుంటుంది. దీని ధర దాదాపు రూ. 12 కోట్లు, ఎక్స్-షోరూమ్. మెక్‌లారెన్ 765 LT ఉత్పత్తి కేవలం 765 యూనిట్లకు మాత్రమే పరిమితం అయింది. ఇది భారతదేశంలోని ఇతర సూపర్‌కార్ల కంటే ప్రత్యేకమైనది. మెక్‌లారెన్ 765 LT స్పైడర్ 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది.