Page Loader
Hyundai AURA: దసరా వేళ.. హ్యుందాయ్ వాహనాలపై భారీ డిస్కౌంట్ 
దసరా వేళ.. హ్యుందాయ్ వాహనాలపై భారీ డిస్కౌంట్

Hyundai AURA: దసరా వేళ.. హ్యుందాయ్ వాహనాలపై భారీ డిస్కౌంట్ 

వ్రాసిన వారు Stalin
Oct 15, 2023
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియా మోటార్ కంపెనీ 'హ్యుందాయ్'.. దసరా పండగ వేళ కీలక ప్రకటన చేసింది. భారతదేశంలో హ్యుందాయ్ డీలర్లు ఈ అక్టోబర్ నెలలో AURA sub-4m sedan సహా, వివిధ మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు. ఈ ప్రయోజనాలు నగదు తగ్గింపులు, బోనస్‌, కార్పొరేట్ తగ్గింపుల రూపంలో అందిస్తున్నారు. సీఎన్‌జీ వెర్షన్‌లో రూ.33,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో నగదు తగ్గింపు రూ.20,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000 వస్తుంది. అదే సమయంలో కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ వెర్షన్‌ వెహికిల్స్‌పై నగదు తగ్గింపు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ రూపంలో రూ.10000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

కారు

నాలుగు వేరియంట్లలో హ్యుందాయ్ AURA

వాస్తవానికి ఈ నెల ప్రారంభంలో హ్యుందాయ్ AURA వాహనాల ధరలను కంపెనీ రూ. 11,200 వరకు పెంచింది. ఈ ధరల పెంపు అనేది E వేరియంట్‌ వాహనాలపై భారీ ప్రభావం చూపింది. ప్రస్తుతం హ్యుందాయ్ AURA నాలుగు వేరియంట్‌లలో లభిస్తోంది. భారతీయ మార్కెట్లో ఇది ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. మార్కెట్‌లో కాంపాక్ట్ సెడాన్ E వేరియంట్ ప్రారంభ ధర రూ.6.44 లక్షలు, టాప్-స్పెక్ SX CNG వేరియంట్ ప్రారంభ ధర ఉంది. దసరా పండగ నేపథ్యంలో కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్లతో కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు భారీ ప్రయోజనాలను పొందవచ్చు. గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ చెబుతోంది.