హ్యూండాయ్ కార్లలో ADAS టెక్నాలజీ: 2025కల్లా అన్ని కార్లలోకి రానున్న టెక్నాలజీ
హ్యూండాయ్ కంపెనీ భద్రత విషయంలో మరో ముందడుగు వేస్తోంది. తన ప్రతీ కారులోనూ ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) అనే టెక్నాలజీతో వస్తోంది. అంతేకాదు బ్లూ లింక్ టెక్నాలజీతోనూ వస్తుంది. మరో విషయం ఏంటంటే, ఇకపై ఆరు ఎయిర్ బ్యాగ్స్ ని ప్రతీ కారులో అందుబాటులో ఉంచనుంది. భద్రత విషయంలో మరింత కట్టుదిట్టంగా ఉండే ADAS టెక్నాలజీ గల ఐదు మోడల్స్ ని తీసుకురానుంది. Hyundai VENUE మోడల్ లో ముందుగా ఈ టెక్నాలజీని తీసుకువస్తున్నట్లు హ్యూండాయ్ సీవోవో తరుణ్ గార్గ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తీసుకొస్తున్న ADAS టెక్నాలజీని 2025కల్లా అన్ని కార్ మోడల్స్ లో అందుబాటులో ఉండేలా చేయనున్నారు.
బ్లూ లింక్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసిన హ్యూండాయ్
2019లో మొదతీసారిగా బ్లూ లింక్ టెక్నాలజీని హ్యూండాయ్ తీసుకొచ్చింది. దీని ప్రకారం, కార్ ని ఎవరైతే దొంగిలిస్తే ట్రాక్ చేసే సౌకర్యం, ఇమ్మొబిలైజేషన్, జియో ఫెన్సింగ్, ఎస్.వో.ఎస్, ఎమర్జన్సీ అసిస్టెన్స్ వంటి ఫీఛర్లు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యూండాయ్ కార్లలో ఈ ఫీఛర్ ఉంది. Grand i10 NIOS, AURA, and KONA EV మోడల్స్ లో మాత్రం ఈ ఫీఛర్ అందుబాటులోకి రాలేదు. భద్రత విషయంలో అన్ని రకాల ఫీఛర్లను హ్యూండాయ్ తీసుకొస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్ట(TPMS), రియర్ వ్యూ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ ఫీఛర్లను అన్ని మోడల్స్ లో తీసుకొస్తున్నారు.