Page Loader
Hyundai Creta EV:క్రెటా ఈవీని ఆవిష్కరించిన హ్యుందాయ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 473km.. జనవరి 17న విడుదల
క్రెటా ఈవీని ఆవిష్కరించిన హ్యుందాయ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 473km.. జనవరి 17న విడుదల

Hyundai Creta EV:క్రెటా ఈవీని ఆవిష్కరించిన హ్యుందాయ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 473km.. జనవరి 17న విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, క్రెటా విద్యుత్ కారు (Hyundai Creta EV)ను ఆవిష్కరించింది. ఈ కారును 2025 జనవరి 17న భారత్ మొబిలిటీ ఎక్స్‌పో వేదికగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంలో కారు లుక్, ఇతర ముఖ్యమైన వివరాలను కూడా హ్యుందాయ్ వెల్లడించింది. ఈవీ విభాగంలో క్రెటా ఈవీ, టాటా కర్వ్, మహీంద్రా బీఈ 6, ఎంజీ జడ్‌ఎస్‌ ఈవీ వంటి కార్లకు పోటీగా నిలవనుంది. హ్యుందాయ్ ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన క్రెటాను ఈవీ వెర్షన్‌లో అందిస్తోంది. సాధారణ క్రెటాకు దగ్గరగా ఉండే డిజైన్‌తో ఈ క్రెటా ఈవీని రూపకల్పన చేయడం విశేషం.

వివరాలు 

కారు ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్‌

అందుబాటు ధరలో ఈ కారును వినియోగదారులకు అందించనున్నట్లు సమాచారం. ఈ కారు ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. డిజిటల్ కీ, లెవల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి ఆధునిక సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. ఈ కారు ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్స్‌లెన్స్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఛార్జింగ్ విషయంలో ఈ కారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్స్‌తో అందుబాటులోకి వస్తుంది.

వివరాలు 

డీసీ ఛార్జర్‌తో కేవలం 58 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్

42 kWh బ్యాటరీ ఉన్న మోడల్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 390 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉన్న మోడల్ అయితే 473 కిలోమీటర్లు ప్రయాణించగలదు. డీసీ ఛార్జర్‌తో కేవలం 58 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అదే 11kW ఏసీ హోమ్ ఛార్జర్‌తో 10 శాతం నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ కారు ధర వివరాలు ఎక్స్‌పో సందర్భంగా వెల్లడికానున్నాయి.