Volkswagen Taigun: రోడ్లపై కనిపించిన కొత్త వోక్స్‌వ్యాగన్ టిగ్వన్.. ఏం మారబోతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా బలంగా నిలుస్తుండగా,ఇప్పుడు దానికి గట్టి పోటీగా ఉన్న వోక్స్‌వ్యాగన్ తన టిగ్వన్ ఫేస్‌లిఫ్ట్‌ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా టిగ్వన్ ఫేస్‌లిఫ్ట్ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. గ్లోబల్‌గా టైరాన్ ఆర్ లైన్‌ను పరిచయం చేసిన తర్వాత, స్కోడా కుషాక్ అప్డేట్‌ను ఆవిష్కరించడంతో, మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో పోటీకి తగ్గట్టు వోక్స్వాగన్ కూడా వేగం పెంచినట్లు తెలుస్తోంది. స్పై చిత్రాల ప్రకారం ముందు,వెనుక భాగాల్లో భారీ కవరింగ్ కనిపించడం వల్ల ప్రధానంగా డిజైన్ మార్పులపై కంపెనీ దృష్టిపెట్టినట్టు స్పష్టమవుతోంది. కొత్త షార్ప్ గ్రిల్,స్లీక్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్ ఉండే అవకాశం ఉంది.
వివరాలు
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కనెక్టెడ్ టెక్నాలజీ
వెనుక భాగంలో కనెక్టెడ్ లైట్ బార్‌తో కొత్త ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, మార్చిన బంపర్ డిజైన్ వాహనానికి మరింత ఫ్రెష్ లుక్ ఇవ్వనుంది. లోపల ప్రస్తుత క్యాబిన్ లేఅవుట్ అలాగే ఉంచి, కొత్త కలర్ థీమ్స్ తీసుకురానున్నట్లు సమాచారం. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ప్యానోరామిక్ సన్‌రూఫ్,పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశముంది. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కనెక్టెడ్ టెక్నాలజీతో కొనసాగనుంది. సేఫ్టీ విషయంలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ స్టాండర్డ్‌గా ఇవ్వనున్నారు.
వివరాలు
ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్
అయితే ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్ ఫీచర్లు ఈ అప్డేట్‌లో ఉండకపోవచ్చు. ఇంజిన్ పరంగా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 115 పీఎస్ పవర్, 178 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కొనసాగుతుండగా, ప్రస్తుతం ఉన్న ఆరు స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో కొత్త ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులతో నగర వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం అందించాలనే లక్ష్యంతో వోక్స్వాగన్ ముందుకు సాగుతోంది.