LOADING...
Hyundai: హ్యుందాయ్ క్రేటర్.. కొత్త ఆఫ్‌రోడ్ ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ లాంచ్
హ్యుందాయ్ క్రేటర్.. కొత్త ఆఫ్‌రోడ్ ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ లాంచ్

Hyundai: హ్యుందాయ్ క్రేటర్.. కొత్త ఆఫ్‌రోడ్ ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ లాంచ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ పూర్తిగా కొత్తగా ఆఫ్‌రోడ్‌కు తగ్గ ఎలక్ట్రిక్‌ SUV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. 'క్రేటర్' పేరుతో వచ్చిన ఈ కాన్సెప్ట్ SUV కఠినమైన మార్గాలను సులభంగా ఎదుర్కొనేలా డిజైన్‌ చేయబడింది. 33 ఇంచుల హెవీ ఆఫ్‌రోడ్ టైర్లు, స్కిడ్ ప్లేట్లు, టౌ హుక్స్, అదనపు లైట్లు వంటివి దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. IONIQ 5 XRTలో కనిపించినట్టే, బాడీ మొత్తం డిజిటల్ పిక్సెల్ కెమోఫ్లేజ్ ప్యాటర్న్‌తో బోల్డ్ లుక్‌లో కనిపిస్తుంది. ముందుభాగంలో అనోడైజ్డ్ రికవరీ హుక్స్‌కు 'క్రేటర్ మాన్' అనే చిన్న క్యారెక్టర్‌ను జోడించారు. ఇదే ఈ కాన్సెప్ట్‌కు లోగోలా ఉపయోగించారు. బయటనే కాదు, సీట్ బకిల్స్‌, డాష్‌బోర్డ్‌, ఇతర చిన్న డిజైన్ ఎలిమెంట్లలో కూడా ఇది కనిపిస్తుంది.

డాష్‌బోర్డ్

సాధారణ డాష్‌బోర్డ్‌ బదులుగా.. సిలిండర్ ఆకార స్ట్రక్చర్

లోపల మాత్రం పూర్తిగా ఫ్యూచరిస్టిక్ క్యాబిన్‌ వీక్షణం కనిపిస్తుంది. సాధారణ డాష్‌బోర్డ్‌ బదులుగా రెండు స్ట్రాప్స్‌తో వేలాడుతూ ఉండే సిలిండర్ ఆకార స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేశారు. టెక్నాలజీ పరంగా కూడా కొన్ని కొత్త అంశాలు ఉన్నాయి. కారులో ఉన్న నాలుగు చిన్న స్క్వేర్ స్క్రీన్‌లు విడిగా తీసేయవచ్చు. ఇవి Spotify వంటి విడ్జెట్‌లను చూపించేలా రూపొందించారు. మెకానికల్ వివరాల్ని హ్యుందాయ్ ఇంకా స్పష్టంగా వెల్లడించనప్పటికీ, IONIQ 5లో ఉన్న 84 kWh లిథియం-అయాన్ బ్యాటరీ, డ్యువల్ మోటర్ సెటప్‌తో సుమారు 320 హెచ్‌పీ పవర్‌‌, 605Nm టార్క్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

కంట్రోల్

ఆఫ్‌రోడింగ్ కోసం లో రేంజ్‌, లాకింగ్ డిఫరెన్షియల్స్‌ వంటి కంట్రోల్‌లు 

ఆఫ్‌రోడింగ్ కోసం లో రేంజ్‌, లాకింగ్ డిఫరెన్షియల్స్‌ వంటి కంట్రోల్‌లు కూడా అందించారు. ఇవి ఎలక్ట్రిక్ వాహనంలో ఎలా పనిచేస్తాయనే అంశం ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు కానీ, హ్యుందాయ్ ఆఫ్‌రోడింగ్‌పై చూపుతున్న ఆసక్తిని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే ఈ క్రేటర్‌ను ఫోర్డ్ బ్రోంకో లేదా జీప్ రాంగ్లర్‌లకు నేరుగా పోటీగా మార్కెట్లోకి తీసుకురావాలన్న ప్లాన్ హ్యుందాయ్‌కు ప్రస్తుతం లేనట్టే తెలుస్తోంది.