LOADING...
గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్
హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOSలో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి

గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 09, 2023
06:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశంలో గ్రాండ్ i10 NIOS కొత్త స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను రూ.7.16 లక్షల ధరతో పరిచయం చేస్తుంది. కొత్త వేరియంట్ మాన్యువల్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. 2019లో ప్రారంభించినప్పటి నుండి గ్రాండ్ i10 NIOS భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన హ్యుందాయ్ మోడల్‌లలో ఒకటి. తయారీసంస్థ ధరను అదుపులో ఉంచడానికి మాన్యువల్ AC యూనిట్‌తో తన సిరీస్ లో సరికొత్త స్పోర్ట్జ్ ఎగ్జిక్యటివ్ వేరియంట్‌ను పరిచయం చేసింది. హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS లోపల స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ కొన్ని ఫీచర్లను మినహాయించి స్పోర్ట్జ్ మోడల్‌తో సమానంగా ఉంటుంది.

కార్

హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOSలో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి

సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్‌ ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటివి ఉంటాయి. మార్కెట్‌లోని ఇతర ఎంట్రీ-లెవల్ మోడల్‌ల లాగా కాకుండా, హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOSలో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), లోడ్ లిమిటర్‌లతో ఉన్న సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, ABS, EBD, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), స్పీడ్ ఇంపాక్ట్-సెన్సింగ్ డోర్ లాక్‌లతో పాటు ఒక ఇంజిన్ ఇమ్మొబిలైజర్ ఉంటుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ 1.2-లీటర్, 'కప్పా,' ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో నడుస్తుంది,