Page Loader
Hyundai Ketra: అప్‌గ్రేడ్ వర్షన్‌తో రానున్న హ్యుందాయ్ కెట్రా.. లాంచ్ ఎప్పుడంటే..? 
అప్‌గ్రేడ్ వర్షన్‌తో రానున్న హ్యుందాయ్ కెట్రా.. లాంచ్ ఎప్పుడంటే..?

Hyundai Ketra: అప్‌గ్రేడ్ వర్షన్‌తో రానున్న హ్యుందాయ్ కెట్రా.. లాంచ్ ఎప్పుడంటే..? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2023
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్కెట్లో ఎస్‌యూవీల మధ్య గట్టి పోటీ ఉంది. ప్రతి కంపెనీ తన ఎస్‌యూవీని ఇతర వాటి కంటే మెరుగ్గా మార్చేందుకు అప్‌డేట్ చేస్తోంది. తాజాగా హ్యుందాయ్ కెట్రా అప్‌గ్రేడ్ వెర్షన్‌తో ముందుకొస్తోంది. ADAS వంటి కొత్త ఫీచర్లను ఇందులో పొందుపరుస్తున్నారు. ఈ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. నూతన ఫీచర్లు, సరికొత్త లుక్‌తో ఈ ఎస్‌యూవీ కొత్త అనుభూతిని కలిగించనుంది. కొత్త సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మాదిరిగానే ఇది ఉండనుంది. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌కి అసాధారణమైన ఫీచర్‌లను జోడించడంతో సెల్టోస్ కంటే అదనపు ప్రయోజనాలు ఇందులో ఉండనున్నాయి. క్రెటా ఫేస్‌లిఫ్ట్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ, డీఆర్ఎల్ మార్పులతో ఫ్రంట్ ఫాసియాని కలిగి ఉంటుంది.

Details

హ్యుందాయ్  కెట్రాలో అధునాతన ఫీచర్లు 

SUV సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లు, కొత్త టెయిల్ ల్యాంప్‌లతో రానుంది. కొత్త అల్లాయ్ వీల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో డ్యాష్‌బోర్డ్, ఏసీ డిజైన్‌లో కూడా మార్పులు ఉంటాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో కూడిన పనోరమిక్ డిస్‌ప్లే అత్యంత ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లలో ఒకటిగా చెప్పొచ్చు. కొత్త కియా సెల్టోస్ లాగానే, హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది గరిష్టంగా 160 PS పవర్‌ను, 253 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. కొత్త సెల్టోస్ మాదిరిగానే దీని ధర ఉండొచ్చు.