మెరుగైన సేఫ్టీ ఫీచర్లలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ భారత్ మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. దీన్ని జూలై 10న లాంచ్ చేస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఈ హ్యుందాయ్ ఎక్స్ టర్ ధర రూ. 6 లక్షల నుంచి రూ.9.50 లక్షల వరకు ఉండొచ్చు. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ, మారుతిసుజుకి ఫ్రాంక్స్ వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఎక్స్ టర్ మైక్రో ఎస్‌యూవీకి చెందిన సేప్టీ ఫీచర్లను హ్యుందాడ్ ప్రకటించింది. అన్ని వేరియంట్లకు ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న తొలి సబ్ ఫోర్ మీటర్ ఎస్ యూవీ కారుగా హ్యుందాయ్ ఎక్స్ టర్ నిలవనుంది. టెయిల్‌లైట్‌లను కలుపుతూ వెడల్పాటి బ్లాక్ ప్యానెల్, కారు దిగువన ప్రముఖ రియర్ స్కిడ్ ప్లేట్ ఉండడం విశేషం.
ఐదు వేరియంట్లలో రానున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో 1.2-లీటర్ సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, పెట్రోల్‌తో నడుస్తున్నప్పుడు, పవర్‌ట్రెయిన్ 82 bhp గరిష్ట శక్తిని, 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. హ్యుందాయ్ డీలర్ షిప్ లో ఈ కారును బుకింగ్స్ చేసుకొనే అవకాశం ఉంది. విదేశాలకు సైతం ఈ వెహికల్ ను ఎగుమతి చేయనున్నారు. హ్యుందాయ్ నుంచి వస్తున్న ఎనిమిదో ఎస్‌యూవీ ఇది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో రానుంది