LOADING...
Hyundai Exter facelift : హ్యుందాయ్ ఎక్స్‌టర్ 2026.. మీ బడ్జెట్‌కు సరిపోయే వేరియంట్ ఇదే?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ 2026.. మీ బడ్జెట్‌కు సరిపోయే వేరియంట్ ఇదే?

Hyundai Exter facelift : హ్యుందాయ్ ఎక్స్‌టర్ 2026.. మీ బడ్జెట్‌కు సరిపోయే వేరియంట్ ఇదే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు హ్యుందాయ్ మోటర్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కంపెనీ 2026 ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తాజాగా విడుదల చేసింది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన భద్రతతో మొత్తం 25కు పైగా అప్‌డేట్స్‌తో ఈ మోడల్ మార్కెట్‌లోకి వచ్చింది. అయితే ఇంజిన్ పరంగా పాత మోడల్‌లో ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను యథాతథంగా కొనసాగించింది.

Details

వేరియంట్లు, ధరలు (ఎక్స్‌-షోరూమ్)

కొత్త ఎక్స్‌టర్ పెట్రోల్ మోడల్ మాన్యువల్ (MT), ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT), అలాగే సీఎన్‌జీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్లు EX (MT): ₹5.79 లక్షలు S (MT): ₹6.23 లక్షలు S+ (MT): ₹7.21 లక్షలు SX (MT): ₹7.95 లక్షలు SX(O) (MT): ₹8.35 లక్షలు S (AMT): ₹6.90 లక్షలు S+ (AMT): ₹8.05 లక్షలు SX (AMT): ₹8.54 లక్షలు SX(O) (AMT): ₹9.07 లక్షలు SX(O) Connect (AMT): ₹9.41 లక్షలు

Details

సీఎన్జీ వేరియంట్లు

EX (MT): ₹6.99 లక్షలు S (MT): ₹7.43 లక్షలు S+ (MT): ₹8.26 లక్షలు SX (MT): ₹8.93 లక్షలు SX(O) (MT): ₹9.40 లక్షలు

Advertisement

Details

డిజైన్‌లో మార్పులు

2026 ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో బాహ్య రూపం ఆకర్షణీయంగా మారింది. ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ థీమ్, కొత్త సీటింగ్ డిజైన్, మెటల్ పెడల్స్, 'డి-కట్' స్టీరింగ్ వీల్‌తో క్యాబిన్‌కు ప్రీమియం టచ్ ఇచ్చారు. ఫీచర్లు సెగ్మెంట్ ఫస్ట్: ఇన్‌బిల్ట్ డాష్‌క్యామ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ డిస్‌ప్లే వెనుక ప్రయాణికుల కోసం టైప్-C ఛార్జింగ్ పోర్ట్

Advertisement

Details

సీఎన్జీ ప్రత్యేకతలు

డ్యూయల్ సిలిండర్ సెటప్‌తో బూట్ స్పేస్‌ను మెరుగుపరిచారు. స్పేర్ టైర్‌ను కారు అడుగు భాగానికి మార్చడం వల్ల 225 లీటర్ల ఖాళీ స్థలం లభిస్తుంది. కలర్స్ కొత్తగా గోల్డెన్ బ్రాంజ్, టైటానియం బ్లాక్ మ్యాట్ రంగులను పరిచయం చేశారు. భద్రత భద్రత విషయంలో కూడా ఈ SUV ప్రత్యేకంగా నిలుస్తోంది. మొత్తం 45కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉండగా, అందులో 30 ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) హిల్ స్టార్ట్ అసిస్ట్ (HAC) మొత్తానికి, కొత్త ఫీచర్లు, మెరుగైన డిజైన్, భద్రతతో 2026 ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మైక్రో ఎస్‌యూవీ విభాగంలో మరింత పోటీని పెంచే అవకాశముంది.

Advertisement