
EVs : కొత్త ఈవీలను కొనాలంటే.. వీటి గురుంచి తెలుసుకోవాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు రోజు రోజుకూ ఊపందుకుంటున్నాయి.
పెట్రోల్, డీజల్ ధరలు అధికంగా ఉండటంతో ప్రజల్లో ఈవీల పట్ల ఆసక్తి పెరిగుతోంది.
కొనుగొలుదారులు ఈవీలపై ఆసక్తి చూపుతున్నారని ఇటీవలే బజాబ్ సీఈఓ రాజీవ్ బజాబ్ పేర్కొన్న విషయం తెలిసిందే.
రాబోయే పండుగల సీజన్‌లో ఈవీల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈవీలను కొనాలంటే కొన్ని విషయాల గురించి తెలుసుకోవాల్సిందే.
ప్రయోజనాలు
పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.
రోజూ కొంతదూరం ప్రయాణించే వారు ఈవీలైతే తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చని భావిస్తున్నారు.
Details
విద్యుత్ వాహనాల మెయింటెన్స్ తక్కువ
ముఖ్యంగా విద్యుత్ వాహనాల మెయింటెనెన్స్ కూడా తక్కువే అని చెప్పారు. పెట్రోల్ వాహనాలు రిపేర్ వస్తే వేలల్లో ఖర్చు అవుతుంది.
అదే ఎలక్ట్రిక్ వాహనాలకైతే అంత ఖర్చవ్వదు.
విద్యుత్ వాహనాల కోసం ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలను అందిస్తోంది.
ఈవీలను క్రెడిట్ పైన కొనుగోలు చేస్తే సెక్షన్ 80EEB కింద రూ.1.5 లక్షల వరకు వడ్డీ మొత్తంపై పన్ను రాయితీ పొందవచ్చు.
ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలంటే ముందుగా రేంజ్‌ను దృష్టిలో పెట్టుకోవాలి.
సర్వీస్ సెంటర్లు దగ్గర్లోనే ఉన్నాయా లేదో చూసుకోవాలి. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి.
చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడే ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో వచ్చే అవకాశం లేదు. కావున ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
Details
ఈవీల ఛార్జింగ్ కి గంటల సమయం
ఈవీల ఛార్జింగ్‌కి గంటల సమయం పడుతుంది. ఈ తరుణంలో నివాసం ఉండే చోట ఛార్జింగ్‌కు అనువుగా ఉందో లేదో సరిచూసుకోవాలి.
విద్యుత్ వాహనాల్లో బ్యాటరీనే కీలకమని చెప్పాలి.
ఇక కారు బ్యాటరీ మార్చుకోవాలంటే రూ.4లక్షలు, టూవీలర్ బ్యాటరీ అయితే రూ.50వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు దాని రీసేల్ వాల్యూ చూస్తాం.
అయితే ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో రీసేల్ వాల్యూ గురించి ఆలోచించకపోవడం మంచిది.