హెలికాప్టర్ కంటే వేగంగా ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీ వచ్చేసింది..!
మనం ఇప్పటివరకు చాలా టాక్సీలను చూసి ఉంటాం. కానీ ఇది సరికొత్త ఎలక్ట్రిక్ టాక్సీ. ఇది వరకు ఎన్నడూ లేనట్లుగా ఆకాశంలో ఎగిరే టాక్సీ, త్వరలో ఆకాశంలో వెళుతూ గమ్యానికి చేరుకునేలా ఓ టాక్సీ అందుబాటులో రానుంది. త్వరలో బెంగళూరు జరిగే ఏరో ఇండియా ఈ ప్రదర్శనకు వేదిక కానుంది. IIT మద్రాస్ విశ్వవిద్యాలయం రూపకల్పన చేసిన ఈ ప్లేన్ టాక్సీని ePlance సంస్థ అభివృద్ధి చేయనుంది. హెలికాప్టర్ కంటే వేగంగా తక్కువ సమయంలో ప్రయాణికులు తమ లక్ష్యాలను చేరుకొనేలా దీన్ని రూపొందించారు. ఇందుకోసం 2017లో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ స్టార్టప్‌కు పునాది పడింది. తాజాగా ఇది అందుబాటులోకి వచ్చి తన సర్వీసులను అందించేందుకు తయారైంది.
ఒక్కసారి ఛార్జీ చేస్తే 200 కిలోమీటర్లు
ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల ఈ ఏరో టాక్సీలో ప్రయాణించే అవకాశం ఉంది. కేవలం 25 స్క్వేర్ మీటర్ల స్థలంలో దీన్ని ల్యాండింగ్ చేయొచ్చు. 4 రెక్కలు ఈ టాక్సీకి అమర్చారు. మొత్తం దీని బరువు 200 కిలోలు మాత్రమే. ఇది 457 మీటర్ల ఎత్తున ప్రయాణించనుంది. ప్రస్తుతం ఈ ప్లేన్ లో కేవలం ఇద్దరు ప్యాసింజర్స్ మాత్రమే ప్రయాణించగలరు. భవిష్యత్ లో దీని సంఖ్యను పెంచే అవకాశం ఉంది. ఈ ప్లేన్ కి అమర్చిన బ్యాటరీ ఫిక్స్ చేసి ఉంటుంది. దాంతో వేరే బ్యాటరీలు ఈ ప్లేన్‌కి అమర్చేందుకు అవకాశం లేదు