Page Loader
2024లో భారత మార్కెట్‌లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు 
2024లో భారత మార్కెట్‌లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు

2024లో భారత మార్కెట్‌లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు 

వ్రాసిన వారు Stalin
Sep 03, 2023
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఎండబ్ల్యూ యాజమాన్యంలో నడుస్తున్న ప్రఖ్యాత బ్రిటీష్ ఆటోమోటివ్ కంపెనీ మినీ(MINI) నూతన వెర్షెన్ '2024 కూపర్ ఈవీ(Cooper EV) కారును భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మోడల్‌ను కంపెనీ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది క్యూ1లో కూపర్ ఈవీలోని రెండు వేరియంట్లను కంపెనీ భారత మార్కెట్‌లోకి పెట్టబోతోంది. మినీ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్‌ను 'E', 'SE' అనే రెండు వేరియంట్లలో తీసుకొస్తోంది. కూపర్ ఈవీ మోడల్ వాహనం సుపరిచితమైన హ్యాచ్‌బ్యాక్ ఆకారాన్ని కలిగి ఉన్నప్పటికీ.. దీని డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది.

కారు

స్టైలిష్ డ్యూయల్-టోన్ వీల్స్‌, ఓవల్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు

మినీ కూపర్ ఈవీ 2024 వాహనం ఓవల్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, చెక్కిన బానెట్, స్టైలిష్ డ్యూయల్-టోన్ వీల్స్‌తో వస్తుంది. లోపల క్యాబిన్ ప్రీమియం ఫాబ్రిక్‌తో చేసిన స్పోర్టీ, సింపుల్ డాష్‌బోర్డ్‌ను ఈ వాహనంలో ఉన్నాయి. కారులో లెథెరెట్‌తో కూడిన బకెట్ సీట్లు, ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సాంప్రదాయ గేజ్‌లకు బదులుగా హెడ్-అప్ డిస్‌ప్లే ఉన్నాయి. దీనికి ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. E మోడల్ వేరియంట్ 40.7kWh బ్యాటరీతో 181hpని కలిగి ఉంది. SE మోడల్ 214hp, 54.2kWh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.