Page Loader
కొత్త కవాసకి ఎలిమినేటర్ వర్సెస్ బెనెల్లీ 502C.. ఏ స్కూటర్ బెస్ట్?
కొత్త కవాసకి ఎలిమినేటర్ వర్సెస్ బెనెల్లీ 502C.. ఏ స్కూటర్ బెస్ట్?

కొత్త కవాసకి ఎలిమినేటర్ వర్సెస్ బెనెల్లీ 502C.. ఏ స్కూటర్ బెస్ట్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2024
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

కవాసాకి ఇటీవలే ఇండియాలో ఎలిమినేటర్ బైక్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ బైక్ కొనే ధరతో ఓ కారు కొనచ్చు. భారతదేశ మార్కెట్లో 5.61 లక్షలకు లాంచ్ అయిన ఈ నియో రెట్రో క్రూయిజర్ బైక్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ బైకుకు పోటీగా బెనెల్లీ 502Cకి ప్రత్యర్థిగా నిలవనుంది. ప్రస్తుతం ఈ రెండింట్లో ఏది ఉత్తమైన ఎంపికో తెలుసుకుందాం. ఎలిమినేటర్ కవాసకి నియో-రెట్రో డిజైన్ ఫిలాసఫీని అనుసరిస్తుంది. బెనెల్లీ 502Cలో 21-లీటర్ ఇంధన ట్యాంక్, DRLతో కూడిన LED హెడ్‌ల్యాంప్, డ్యూయల్-బ్యారెల్ ఎగ్జాస్ట్, స్ప్లిట్-టైప్ సీట్లు, హ్యాండిల్‌బార్, డ్యూయల్ LED టెయిల్‌లైట్‌లను కలిగి ఉంది.

Details

బెనల్లీ 502లో అత్యాధునిక ఫీచర్లు

అదే సమయంలో కవాసకి ఎలిమినేటర్‌లో 13-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, ఇంటిగ్రేటెడ్ DRLతో కూడిన రౌండ్ LED హెడ్‌లైట్, స్ప్లిట్-టైప్ సీట్లు, విశాలమైన హ్యాండిల్ బార్, వృత్తాకార అద్దాలు, సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్, సొగసైన LED టెయిల్లాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు బైకుల్లో డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ABSతో వస్తాయి. ఎలిమినేటర్‌లో 41ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. కవాసకి ఎలిమినేటర్, బెనెల్లీ 502C రెండూ ప్రీమియం సబ్-500cc విభాగంలో పోటీపడుతున్నాయి. ఇక బెనల్లీ 502Cలో శక్తివంతమైన ఇంజిన్, అత్యాధునిక ఫీచర్స్ ఉండనున్నాయి.