కవాసకి నింజా 500 వర్సెస్ అల్ట్రావయోలెట్ F77.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?
బెంగళూరుకు చెందిన EV తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ ఇటీవలే F77 బైక్‌ని నటుడు రోహిత్ రాయ్‌కి డెలివరీ చేసింది. ఈ మోడల్ ప్రస్తుతం భారతీయ మోటార్‌సైక్లింగ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 307కిమీల వరకు ప్రయాణిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ. 3. 8లక్షలగా ఉండనుంది. F77కి పోటీగా కవాసకి నింజా 500 మార్కెట్లోకి వచ్చింది. అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ F77 సూపర్‌స్పోర్ట్ బైక్ ఈవి రంగంలో దూసుకెళ్తుతోంది. ఇది భారతదేశపు మొట్టమెదటి ఆల్-ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌గా గుర్తించారు.
కవాసకి నింజా 500లో అధునాతన ఫీచర్లు
కవాసకి నింజా 500లో డ్యూయల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్ యూనిట్లు, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, నిటారుగా ఉండే విండ్‌స్క్రీన్, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, TFT ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఉన్నాయి. అల్ట్రావయోలెట్ F77లో LED హెడ్‌ల్యాంప్, V- ఆకారపు LED DRLలు, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్, స్ప్లిట్-టైప్ సీట్లు, ఫారింగ్-మౌంటెడ్ వింగ్‌లెట్‌లు, TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు బైకుల్లో రైడర్ల భద్రత కోసం డిస్క్ బ్రేక్‌లు,డ్యూయల్-ఛానల్ ABSతో రానున్నాయి. అల్ట్రావయోలెట్ F77 ధర స్టాండర్ట్ వేరియంట్ కోసం రూ. 3.8 లక్షలు, రూ. రీకాన్ ట్రిమ్ కోసం 4.55 లక్షలు, రూ. స్పేస్ ఎడిషన్ కోసం 5.6 లక్షలుగా ఉంది. ఇక కవాసకి నింజాలో ధర రూ. 5లక్షలు ఉండనుంది.