LOADING...
Electric Scooter: డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఓకే.. ఈ స్కూటర్లు నడిపేందుకు అనుమతి అవసరం లేదు!
డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఓకే.. ఈ స్కూటర్లు నడిపేందుకు అనుమతి అవసరం లేదు!

Electric Scooter: డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఓకే.. ఈ స్కూటర్లు నడిపేందుకు అనుమతి అవసరం లేదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2025
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్‌ రోజు రోజుకు పెరుగుతోంది. అయితే వీటిని నడపాలంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా? అనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యే అంశం. వాస్తవానికి, అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ అవసరం ఉండదు. గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మోటార్ పవర్‌ 250వాట్లలోపు ఉన్న స్కూటర్లను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలాంటి స్కూటర్లు ధరలో కూడా అందుబాటులో ఉంటూ, రైడింగ్‌ కోసం ఎలాంటి అనుమతులు అవసరం లేని విధంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ విభాగానికి చెందిన అనేక స్కూటర్లు లభిస్తున్నాయి.

Details

 1. జెలియో లిటిల్ గ్రేసీ

జెలియో కంపెనీ ఈ తక్కువ వేగం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తోంది. గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. కాగా, ఒక్కసారి ఛార్జ్‌తో 70-75 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.49,500. 2. యులు విన్ యులు విన్ స్కూటర్ గరిష్టంగా 25 కి.మీ./గంట వేగంతో నడుస్తుంది. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది, అంటే అవసరమైతే దానిని మార్చుకోవచ్చు. దీని ధర రూ.55,555. 3. కైనెటిక్ గ్రీన్ జింగ్ కైనెటిక్ గ్రీన్ జింగ్ మోడల్ 25 కి.మీ./గంట వేగంతో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. దీని ధర రూ.75,990.

Details

 4. ఒకినావా R30

ఒకినావా కంపెనీకి చెందిన R30 కూడా తక్కువ వేగం ఎలక్ట్రిక్ స్కూటర్‌గా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది 25 కి.మీ./గంట వేగంతో నడుస్తూ, 60 కి.మీ. వరకు ప్రయాణించగలదు. దీని ధర రూ.61,998. మొత్తంగా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా వినియోగదారులు ఈ స్కూటర్లను చట్టబద్ధంగా వాడవచ్చు. ధరలు కూడా బడ్జెట్‌ పరిధిలో ఉండటంతో, మొదటిసారి వాహనం కొనాలనుకునేవారికి ఇవి ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి.