Jeep: రూ.36 లక్షల ధరలో జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
జీప్ ఇండియా తమ ప్రముఖ మెరిడియన్ ఎస్‌యూవీకి కొత్త లిమిటెడ్ ఎడిషన్‌గా ట్రాక్ ఎడిషన్ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ వేరియంట్ ధర 4x2 మోడల్‌కు రూ.35.95 లక్షలు, 4x4 మోడల్‌కు రూ.37.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఓవర్ల్యాండ్ వేరియంట్ ఆధారంగా రూపొందించిన ఈ ట్రాక్ ఎడిషన్‌లో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా,డిజైన్‌కి సంబంధించి కొన్ని కొత్త టచ్‌లు,క్యాబిన్‌లో ఉపయోగకరమైన అప్‌డేట్స్ ఇచ్చారు. ముఖ్యంగా కస్టమర్ల అభిప్రాయాల మేరకు రెండో వరుస సీట్లకు 140 ఎంఎం స్లైడింగ్ ఫంక్షన్ అందించారు.
వివరాలు
భారత్‌లో బుకింగ్స్ ఓపెన్ చేసిన జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్
బయట భాగంలో పియానో బ్లాక్ గ్రిల్,18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్,డార్క్ ఎస్ప్రెస్సో గ్రిల్, ట్రాక్ ఎడిషన్ బ్యాడ్జింగ్, హుడ్ డీకల్ కనిపిస్తాయి. లోపల డ్యూయల్ టోన్ టుపెలో అప్హోల్స్టరీ, సూయేడ్ ఇన్‌సర్ట్స్, క్విల్టెడ్ డిజైన్‌తో పాటు పియానో బ్లాక్ ట్రిమ్ ఇచ్చారు. ఇందులో 170 హెచ్‌పీ పవర్, 350 ఎన్‌ఎం టార్క్ ఇచ్చే 2.0 లీటర్ మల్టీజెట్ II డీజిల్ ఇంజిన్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ ఆప్షన్లు కొనసాగుతున్నాయి. అలాగే సెలెక్-టెరైన్ సిస్టమ్, లెవల్-2 అడాస్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, ప్యానోరామిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ బుకింగ్స్ దేశవ్యాప్తంగా జీప్ షోరూమ్‌లలో, ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి.