KIA Carens Clavis EV HTK Plus:ఎలక్ట్రిక్ MPV సెగ్మెంట్‌లో మరో ముందడుగు వేసిన కియా..ఒకసారి ఛార్జ్ చేస్తే 404 కి.మీ
ఈ వార్తాకథనం ఏంటి
కియా ఇండియా ఎలక్ట్రిక్ MPV విభాగంలో మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే Carens Clavis EVతో మార్కెట్‌లో ఉన్న కంపెనీ, ఇప్పుడు దీనిలో బేస్ వేరియంట్‌గా HTK Plusను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేరియంట్ ధర సుమారుగా రూ.17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండే అవకాశం ఉందని సమాచారం. HTK Plus మోడల్‌లో 42 kWh బ్యాటరీ ప్యాక్ను అందిస్తుండగా, ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 404 కిలోమీటర్ల ARAI రేంజ్ ఇస్తుందని కియా ప్రకటించింది. ఇందులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ 133 bhp పవర్, 255 Nm టార్క్ను ఉత్పత్తి చేయగలదు.
వివరాలు
39 నిమిషాల్లో ఛార్జ్ చేసుకునే అవకాశం
ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో వినియోగదారులకు ఉండే ఛార్జింగ్ భయాన్ని తగ్గించేలా కియా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 11kW AC ఛార్జర్తో కేవలం 4 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుండగా,100kW DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 39 నిమిషాల్లో ఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది. భద్రత పరంగానూ ఈ బేస్ వేరియంట్ బలంగా ఉంది. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్,ABS,ESC,హిల్ స్టార్ట్ అసిస్ట్,TPMS, ఆల్-ఫోర్ డిస్క్ బ్రేక్స్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే,స్టార్ మ్యాప్ LED DRLs, ఐస్-క్యూబ్ LED హెడ్‌ల్యాంప్స్,16ఇంచ్ ఏరో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెనా వంటి ఆకర్షణీయ అంశాలు కనిపిస్తాయి.
వివరాలు
పరిమితంగా లగ్జరీ ఫీచర్లు
ఇంటీరియర్‌లో బ్లాక్-బేజ్ డ్యుయల్ టోన్ క్యాబిన్, రెండో,మూడో వరుస సీట్లకు రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, 5 USB Type-C పోర్ట్స్, i-Pedal, రీజెన్ కంట్రోల్ ప్యాడిల్ షిఫ్టర్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. లగ్జరీ ఫీచర్లు పరిమితంగా ఉన్నప్పటికీ, మంచి రేంజ్, బలమైన భద్రత, కుటుంబానికి సరిపడా స్థలం, ప్రాక్టికల్ పనితీరుతో విలువైన ఎలక్ట్రిక్ MPVగా HTK Plus నిలుస్తుందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ఎయిర్‌బ్యాగ్స్..
ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) హిల్ స్టార్ట్ అసిస్ట్ TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ఆల్-ఫోర్ డిస్క్ బ్రేక్స్ ఎక్స్‌టీరియర్ ఫీచర్లు Star Map LED DRLs Ice Cube LED హెడ్‌ల్యాంప్స్ (Welcome ఫంక్షన్‌తో) 16-ఇంచ్ Glossy Aero Alloy వీల్స్ Roof Rails Shark Fin Antenna
వివరాలు
ఇంటీరియర్ & సౌకర్యాలు
2nd & 3rd రోలకు రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్ 5 USB Type-C ఛార్జింగ్ పోర్ట్స్ 4.2-ఇంచ్ MIDతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ 8-ఇంచ్ Touchscreen Infotainment Wireless Android Auto & Apple CarPlay Regenerative Braking Controlకు Paddle Shifters i-Pedal & i-Pedal Driving Mode