
Kia Carens X-Line : కియా కేరన్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారత కారు మార్కెట్లో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటర్స్ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.
తాజాగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కియా కేరెన్స్ ఎక్స్ లైన్ కారును విడుదల చేసింది. శక్తివంతమైన ఇంజన్‌తో ఎంపివి కావాలనుకునే వారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
ఈ కారు పెట్రోల్ 7DCT, డీజిల్ 6AT వెర్షన్‌లతో ముందుకొస్తోంది. వీటి ధర రూ. 18.95 లక్షల నుంచి రూ. 19.45 లక్షల మధ్యలో ఉండొచ్చు.
కొనుగోలుదారులను ఆకట్టుకొనే లక్ష్యంతో కియా కేరన్స్ ఎక్స్‌లైన్‌లో స్టాండ్ అవుట్ డిజైన్ ఎలిమెంట్స్ ను అదనంగా జోడించారు.
మ్యాట్ గ్రాఫైట్ కలర్, కేరెన్స్ X-లైన్ పియానో బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, క్రోమ్డ్ రేడియేటర్ గ్రిల్ గార్నిష్‌తో దీన్ని రూపొందించారు.
Details
కియా కేరన్స్ లో అధునాతన ఫీచర్లు
MPV 16-అంగుళాల డ్యూయల్-టోన్ క్రిస్టల్-కట్ అల్లాయ్ వీల్స్‌తో చాలా స్టైలీస్‌గా తీర్చిద్దారు.
ఇది 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ (డీజిల్ మాత్రమే) మరియు 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ఎంపికను కలిగి ఉంది.
ఇది 158 హెచ్‌పిని, 114 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ స్టాండర్డ్‌గా ఉన్నాయి