LOADING...
Kia EV5 electric car :అదిరే లుక్‌తో కియా ఈవీ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!
అదిరే లుక్‌తో కియా ఈవీ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!

Kia EV5 electric car :అదిరే లుక్‌తో కియా ఈవీ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2023
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటర్స్ దుమ్ములేపుతోంది. కియా మోటర్స్‌కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కియా ఈవీ5 ఎలక్ట్రిక్ కారును ఆ సంస్థ ఆఫీషియల్‌గా ఆవిష్కరించింది. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న చెంగ్డూ మోటర్ షోలో ఈ 5 సీటర్ ఎస్‌యూవీని కియా మోటర్స్ ప్రదర్శించింది. ఈ తరుణంలో ఈ ఈవీ స్పెషల్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం. ఈ మిడ్-సైజ్ ప్రీమియం ఈవీ ఫ్రెంట్‌లో ఉన్న టైగర్ నోస్ గ్రిల్, కింక్‌డ్ రేర్ బెల్ట్ లైన్, అలాయ్ వీల్స్‌కు వస్తున్న యాంగ్యులర్ డిజైన్లు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలవనున్నాయి. ముఖ్యంగా రేర్ వింగ్‌లో ఎయిరో డైనమిక్ ఎఫీషియెన్స్ మెరుగుపరిచే విధంగా ఈ ఈవీని డిజైన్ చేశారు.

Details

కియా ఈవీ 5 ధరపై అధికారిక ప్రకటన వెలువడలేదు

కియా ఈవీ 5 కేబిన్‌లో డాష్ బోర్డు, ఇన్ఫోటైన్‌మెంట్ కన్సోల్‌లు, స్టీరింగ్ వీల్ ఉండనున్నాయి. స్టీరింగ్ వీల్ లో చాలా బటన్స్ ఉండటంతో కార్ పంక్షనింగ్‌ని వీటితో కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ మోడల్ చైనాలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియాలో లాంచ్‌పై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇక ధరపై అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ మోడల్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని ఈవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈవీ6, ఈవీ9తో కియా మోటార్స్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ పోర్ట్​ఫోలియో ఇప్పటికే పటిష్టంగా ఉంది. ఇక ఈవీ5 ఎంట్రీతో ఇది మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.