స్టైలిష్ లుక్‌తో కియా సెల్టోస్ ఫేస్‌లిస్ట్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!
కియో సెల్టోస్ ఎస్‌యూవీని ఇండియాలో కియో మోటర్స్ ఆవిష్కరించింది. అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్లకు ఈ ఎస్‌యూవీ ఆకర్షిస్తోంది. ఇది చాలా అప్డేట్స్‌తో ముందుకొచ్చింది. 2023 మచ్ అవైటెడ్ కార్స్‌లో కియా సెల్టోస్ ఫేస్‌లిస్ట్ ఒకటి. సెల్టోస్ కియాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. దీంతో ఫేస్‌లిస్ట్ వర్షెన్ పై సర్వత్రా ఆసక్తి పెరిగింది. ఇందులో ల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ డిజైన్ మారింది. బంపర్‌తో పాటు రేడియేటర్ గ్రిల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. అలాయ్ వీల్స్, స్కిడ్ ప్లేట్ కూడా కొత్తగా వచ్చింది. ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, పానోరమిక్ సన్‌రూఫ్ వంటివి కొత్తగా ఇందులో యాడ్ అయ్యాయి.సెల్టోస్ కేబిన్ చాలా స్పేషియస్గా మారింది.
2019లో ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టిన కియా సెల్టోస్
కియా సెల్టోస్ తొలిసారిగా ఇండియా మార్కెట్లోకి 2019లో అడుగుపెట్టింది. సంస్థ సేల్స్ లో ఈ ఎస్‌యూవీ వాటా 50శాతం కన్నా ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక ఫేస్‌లిప్ట్‌తో సేల్స్ ను పెంచాలని కియా సంస్థ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్‌లోని ఓ ఫ్యాక్టరీలో ఈ కియా సెల్టోస్‌ను రూపొందిస్తోంది. ఇప్పటికే సెల్టోస్‌ను వాడుతున్న కస్టమర్లకు ఓ అప్డేట్ వచ్చింది. ఫేస్‌లిప్ట్ వర్షెన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే డెలవరీల్లో వారికి ప్రాధాన్యత ఇస్తామని కియా సంస్థ స్పష్టం చేసింది. ఈ సెల్టోస్ ఫేస్‌లిప్ట్ గతేడాదిలోనే లాంచ్ అయింది. తాజాగా ఇండియాలోనూ కియా మోటర్స్ ఆవిష్కరించింది.