Page Loader
ADAS ఫీచర్లతో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలు ఇవే!
ADAS ఫీచర్లతో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలు ఇవే!

ADAS ఫీచర్లతో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2023
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఇటీవల ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. కారు కంపెనీలు కూడా కొత్త ఫీచర్లతో ఎస్‌యూవీలను లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ కొరియన్ కంపెనీ కియా మోటర్స్ సైతం ప్రస్తుతం కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300 వాహనాలను గట్టి పోటీ ఇచ్చేందుకు అధునాతన ఫీచర్లతో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌తో కియా ADAS ఫీచర్‌లను పరిచయం చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. కియా ఇటీవల ADAS ఫీచర్లతో కొత్త సెల్టోస్‌ను విడుదల చేసింది. కొత్త సెల్టోస్ ADAS లెవెల్-2తో పోలిస్తే, సోనెట్ ఫేస్‌లిఫ్ట్ దాదాపు 7 నుండి 8 ADAS ఫీచర్లను కలిగి ఉంది.

Details

కియా సెనెట్ ఫేస్‌లిఫ్ట్ లో అధునాతన ఫీచర్లు

సోనెట్ స్టాండర్డ్ సేఫ్టీ కిట్ అనే కొత్త ఫీచర్‌తో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ రానుంది. ఇందులో 360° సరౌండ్ వ్యూ కెమెరాను ప్రత్యేకంగా అమర్చారు. సోనెట్ ఇప్పటికే ప్రయాణికుల కోసం భద్రతాపరమైన చర్యలను తీసుకుంటోంది. అందులో భాగంగా ఈ కారులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ముందు వెనుక పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగాన్ని అధునాతంగా తీర్చిదిద్దారు. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, బోస్ ఆడియో, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి. ప్రస్తుత మోడల్ ధర రూ. 7.79 లక్షల నుండి రూ. 13.09 లక్షల వరకు ఉండనుంది.