Page Loader
కియా సోనెట్ వర్సెస్ టాటా నెక్సాన్.. రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్
కియా సోనెట్ వర్సెస్ టాటా నెక్సాన్.. రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్

కియా సోనెట్ వర్సెస్ టాటా నెక్సాన్.. రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2023
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న కార్లలో కియా సోనెట్ ఒకటి. న్యూ కియా సోనెట్ ఫేస్ లిప్ట్ 2024 ను శుక్రవారం ఆవిష్కరించారు. గతంలో పోలిస్తే మరింత స్టైలిష్‌గా, టెక్ లోడెడ్‌గా కారు రాబోతోంది. డిసెంబర్ 20 నుంచి న్యూ సోనెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఈ వెహికల్‌కి టాటా నెక్సాన్‌ గట్టి పోటీని ఇవ్వనుంది. 2016లో నెక్సాన్‌తో కాంపాక్ట్ SUV విభాగంలో విప్లవాత్మక మార్పులకు టాటా మోటార్స్ బాధ్యత వహించింది. టాటా నెక్సాన్‌లో DRLలతో LED హెడ్‌లైట్‌లు, స్కిడ్ ప్లేట్‌లతో రిఫ్రెష్ చేసిన బంపర్‌లు, 16-అంగుళాల డ్యూయల్-టోన్ వీల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Details

కియా సోనెట్ లో భద్రతా ఫీచర్లు

సోనెట్‌లో ఐదు-సీట్ల క్యాబిన్‌, పవర్డ్ డ్రైవర్ సీటు, ప్రీమియం లెథెరెట్ అప్హోల్స్టరీ, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ సీట్లు, మూడ్ లైటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, బోస్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ-వ్యూ కెమెరాలు వంటి ఫీచర్లు ఉన్నాయి. అదే విధంగా లెవెల్-1 ADAS సూట్ ఉన్నాయి. Nexonలో మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్, లెథెరెట్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్-అసిస్టెడ్ సన్‌రూఫ్, టచ్-సెన్సిటివ్ AC కంట్రోల్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన విశాలమైన క్యాబిన్‌ ఉంది. భారతదేశంలో టాటా నెక్సాన్ రూ. రూ. 8.1 లక్షల నుంచి రూ. 15.5 లక్షల మధ్య ఉంది. మరోవైపు, 2024 కియా సోనెట్ ధర రూ. 8 లక్షలు నుంచి రూ. 16 లక్షలోపు ఉంది.