Page Loader
త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా
ప్రధాన స్టాండ్, సైడ్ స్టాండ్, స్వింగ్ ఆర్మ్‌తో సహా ఉన్న ఎలక్ట్రిక్ లూనా

త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 27, 2022
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్గదర్శకంగా నిలిచిన లైఫ్ ఫర్ కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి మోపెడ్ "లూనా" సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం అవతారంలో సోదర సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ & పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా లాంచ్ కాబోతుంది. E- Luna కోసం ప్రధాన స్టాండ్, సైడ్ స్టాండ్, స్వింగ్ ఆర్మ్‌తో సహా అన్ని ప్రధాన సబ్‌అసెంబ్లీలను అభివృద్ధి చేసింది. నెలకు 5000 సెట్ల ప్రారంభ సామర్థ్యంతో ప్రత్యేక ఉత్పత్తి శ్రేణిని ఏర్పాటు చేసింది. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ తో, E-Luna మరోసారి తన ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అహ్మద్‌నగర్‌లోని ప్లాంట్‌లోని ప్రత్యేకంగా యంత్రాలు ఏర్పాటు చేశారు. అక్కడే 30 వెల్డింగ్ మెషిన్లతో అన్ని భాగాలూ వెల్డింగ్ చేస్తారు.

లూనా

సరికొత్త E-లూనా కోసం అన్ని విభాగాలు అప్ గ్రేడ్ చేసింది KEL

అవసరాలను తీర్చడానికి, KEL తన పెయింట్ షాప్ మరియు ప్రెస్ మరియు ఫ్యాబ్రికేషన్ విభాగాలను అప్‌గ్రేడ్ చేయడానికి 3 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టింది. లూనా రోజుకు 2000 పైగా అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు ఈ కొత్త E-Luna వలన రాబోయే 2-3 సంవత్సరాల్లో సంవత్సరానికి రూ. 30 కోట్లకు పైగా లాభం రావచ్చని కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్, ఎండీ, అజింక్యా ఫిరోడియా తెలిపారు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం, కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లూనాను విడుదల చేయడం ద్వారా ఆటోమొబైల్ రంగంలో చరిత్రను సృష్టించింది. ఆ సమయంలో ధర రూ. 2000 అటువంటిది ఇప్పుడు రోజుకు 2,000 వాహనాలు అమ్ముడుపోయే స్థాయికి పెరిగింది ఈ సంస్థ.