ఓలా ఎస్1 కంటే కొమాకి SE ఎంతో బెటర్.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారు..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ కొమాకి రేంజ్ ఎకో, స్పోర్ట్, స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అనే 3 వేరియంట్లను కలిగి ఉంది.
అయితే కొమాకి SE ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మరింత టెక్నాలజీ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేశారు.2023 (Komaki SE) ధర రూ. 96,968 (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ కానుంది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో విభాగంలో అగ్రశేణిగా ఉన్న ఓలా ఎస్1 స్కూటర్ ను పోటీగా, కొమాకి ఎస్ఈ ముందుకొచ్చింది. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది.
ఇ-స్కూటర్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌లలో ఓలా ఎస్1 ఒకటి చెప్పొచ్చు. ఇప్పుడు అత్యాధునిక ఫీచర్లతో కొమాకి ఎస్ఈ ఎంట్రీతో ఇవ్వడంతో ఓలా ఎస్ 1కు అదరణ తగ్గుతోంది.
Details
కొమాకి ఎస్ఈకి ఒక్కసారి ఛార్జీ చేస్తే 180 కిలోమీటర్లు
కొమాకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ LiFePO4 బ్యాటరీతో 3kW హబ్ మోటార్‌ను ఉపయోగిస్తుంది. దీని బ్యాటరీ 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇందులో డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, యాంటీ-స్కిడ్ టెక్నాలజీ ఉన్నాయి.
ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం TFT స్క్రీన్ ఆన్‌బోర్డ్ విగేషన్, సౌండ్ సిస్టమ్, కాలింగ్ ఆప్షన్‌లను అందిస్తుంది.
రైడర్ల భద్రత కోసం,రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉండనున్నాయి. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
మరోవైపు, Ola S1ని ఒక్కసారి ఛార్జి చేస్తే 125కిలోమీటర్లకు వెళ్లొచ్చు. దీన్ని బట్టి చూస్తే కొమా ఎస్ఈ బెటర్ అప్షన్ గా ఎంపిక చేసుకోవచ్చు.