మార్కెట్లోకి కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
ప్రముఖ ఈవీ స్టార్టప్ కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ ఈవీ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2023 కొమకి ఎస్ఈ ఈవీ స్కూటర్ అత్యాధునిక టెక్నాలజీతో మరెన్నో ఫీచర్లను యాడ్ చేశారు. ముఖ్యంగా ఈ బైక్ ఎల్ఐఎఫ్ఈఫీఓ బ్యాటరీతో ఈ స్కూటర్ నడవనుంది. ఇందులో 2023 కొమకి ఎస్ఈ స్కూటర్ ఎకో, స్కోర్ట్స్, స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లతో రానుంది. కొమకి ఎకో మోడ్‌లో 75-90 కి.మీ, కొమకి ఎస్ఈ స్పోర్ట్ 110-140 కి.మీ, కొమకి ఎస్ఈ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్ గ్రేడ్ 150-180 కి.మీ దూరం ప్రయాణించనున్నాయి.
కొమికి ఎస్ఈ ఎకో రూ.96,968
అదే విధంగా కొమకి ఎస్ఈ ఎకో స్పీడ్ లిమిట్ 55-60 కిమీ, కొమకి ఎస్ఈ స్పోర్ట్, కొమకి ఎస్ఈ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్ గ్రేడ్ స్పీడ్ లిమిట్ 75-80 కి.మీ వెళ్లనుంది. 2023 కొమకి ఎస్ఈ ఈవీ స్కూటర్‌లో పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, ఎల్ఈడీ ఫ్రంట్ వింకర్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డ్యుయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, కీలెస్ ఆపరేషన్, యాంటీ స్కిడ్ టెక్నాలజీ టీఎఫ్టీ స్క్రీన్ తదితర ఫీచర్లతో ముందుకొస్తోంది. ఈ స్కూటర్ పూర్తిగా చార్జింగ్ కావడానికి 4-5 గంటల టైం పడుతుంది. కొమకి ఎస్ఈ ఎకో-రూ.96,968 కొమకి ఎస్ఈ స్పోర్ట్ - రూ.1,29,938 కొమకి ఎస్ఈ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ - రూ.1,38,427