LOADING...
KYV is the new KYC: అక్టోబర్ 31 తర్వాత మీ ఫాస్టాగ్ పనిచేయకపోవచ్చు.. కొత్త KYV నిబంధనలతో జాగ్రత్త!
అక్టోబర్ 31 తర్వాత మీ ఫాస్టాగ్ పనిచేయకపోవచ్చు.. కొత్త KYV నిబంధనలతో జాగ్రత్త!

KYV is the new KYC: అక్టోబర్ 31 తర్వాత మీ ఫాస్టాగ్ పనిచేయకపోవచ్చు.. కొత్త KYV నిబంధనలతో జాగ్రత్త!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశమంతా ఉన్న వాహనదారులు ఇకపై తమ ఫాస్టాగ్‌ని వాడాలంటే తప్పనిసరిగా "నో యువర్ వెహికిల్ (KYV)" అనే కొత్త ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ప్రకారం,అక్టోబర్ 31 తర్వాత KYV చేయని వారి ఫాస్టాగ్‌లు స్వయంచాలకంగా నిలిపివేయబడతాయి. దీని వెనుక ఉద్దేశ్యం ఫాస్టాగ్ దుర్వినియోగాన్ని అరికట్టడం,పారదర్శకత పెంచడం అని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఫాస్టాగ్‌ల దుర్వినియోగం పెరుగుతుండటంతో అధికారులు కొత్త విధానం తెచ్చారు. కొంతమంది ఒకే ఫాస్టాగ్‌ను చాలా వాహనాల్లో వాడడం, దాన్ని పర్స్‌లో పెట్టేసుకోవడం,లేదా కార్‌కి సంబంధించిన ఫాస్టాగ్‌ను లారీకి పెట్టి తక్కువ టోల్‌ చెల్లించడం లాంటి పనులు చేస్తున్నట్లు బయటపడింది.

వివరాలు 

వాహనానికి అనుసంధానం

ఈ సమస్యలను అరికట్టడానికే KYV ద్వారా ప్రతి ఫాస్టాగ్‌ను దాని అసలు వాహనానికి అనుసంధానం చేయనున్నారు. KYV చేయడానికి అవసరమైన పత్రాలు: వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC),యజమాని పేరు, వాహన నంబర్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. అదనంగా ఆధార్,పాన్ లేదా పాస్‌పోర్ట్ వంటి ID ప్రూఫ్, కొన్నిసార్లు వాహనపు ఫోటోలు (ముందు, పక్క ఫోటోలు..వాహన నంబర్ ప్లేట్, ఫాస్టాగ్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి) కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలి: ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ అయి'Update KYV'లేదా 'Know Your Vehicle'ఎంపిక చేసుకుని పత్రాలు అప్‌లోడ్ చేయాలి. OTP ధృవీకరణ పూర్తయిన తర్వాత ట్యాగ్ "Active and Verified"గా చూపిస్తుంది.

వివరాలు 

KYV వల్ల లాభాలు:

KYV చేయకపోతే ఏమవుతుంది: NHAI ప్రకారం, ధృవీకరణ పూర్తి కాని ఫాస్టాగ్‌లు డీ-యాక్టివేట్ అవుతాయి. వాలెట్‌లో బ్యాలెన్స్ ఉన్నా కూడా టోల్ ప్లాజాలలో అవి పనిచేయవు. ఇప్పటికే కొంతమంది వాహనదారులు టెక్నికల్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. KYV వల్ల లాభాలు: ఫాస్టాగ్ దుర్వినియోగం తగ్గుతుంది వాహనం అమ్మకం లేదా దొంగతనం జరిగినప్పుడు ట్రాకింగ్ సులభమవుతుంది టోల్ కేటగిరీ తప్పులు తగ్గుతాయి డిజిటల్ టోల్ సిస్టమ్‌లో పారదర్శకత పెరుగుతుంది వాహనాన్ని అమ్మినప్పుడు లేదా యజమాని మారినప్పుడు మళ్లీ KYV చేయాల్సి ఉంటుంది.

వివరాలు 

వాహనదారులు దీన్ని మరో "KYC" గా భావిస్తున్నారు

అధికారులు దీన్ని రహదారి టోల్ వ్యవస్థను మరింత సమర్థవంతం చేసే చర్యగా చూస్తున్నారు. అయితే చాలామంది వాహనదారులు దీన్ని మరో "KYC" గా భావిస్తున్నారు. అయినా, KYV పూర్తి చేయని వారికి కేవలం నగదు చెల్లింపే మార్గం కావడంతో, చివరికి అందరూ ఈ ప్రక్రియను పూర్తిచేయడం తప్ప మార్గం లేదనిపిస్తోంది.