Page Loader
Tata Nexon EV facelift : సరికొత్తగా టాటా నెక్సాస్ ఈవీ.. ఫేస్ లిఫ్ట్ వర్షెన్ డిజైన్, మోడల్‌లో మార్పులు 
రికొత్తగా టాటా నెక్సాస్ ఈవీ.. ఫేస్ లిఫ్ట్ వర్షెన్ డిజైన్, మోడల్‌లో మార్పులు

Tata Nexon EV facelift : సరికొత్తగా టాటా నెక్సాస్ ఈవీ.. ఫేస్ లిఫ్ట్ వర్షెన్ డిజైన్, మోడల్‌లో మార్పులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2023
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీకి ఫేస్ లిఫ్ట్ వర్షెన్ ను తాజాగా ఆవిష్కరించింది. ఈ ఫేస్ లిఫ్ట్ వర్షెన్‌లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ను సరికొత్త మార్పులతో తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇంటీరియల్, డిజైన్‌లో భారీ మార్పులను ఆ సంస్థ చేసింది. 2023 టాటా నెక్సాన్ ఈవీలో ఎక్స్‌టీరియల్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిద్దారు. ఫ్రెంట్‌లో స్ల్పిప్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్​ డీఆర్​ఎల్స్​, సీక్వెన్షియల్​ టర్న్​ ఇండికేటర్స్​ వంటివి నూతనంగా మార్పు చేశారు. బంపర్స్ కు వర్టికల్ స్ట్రౌట్స్ రానున్నాయి. 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ను కూడా కొత్త డిజైన్ ను ఏర్పాటు చేశారు.

Details

సెప్టెంబర్ 9న టాటా నెక్సాన్​ ఈవీ బుకింగ్స్

టాటా నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​లో 12.3 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 10.25 ఇంచ్​ ఫుల్లీ డిజిటల్​ ఉన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, టచ్​ ఆధారిత ఎయిర్​కాన్​ ప్యానెల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డ్రైవర్​ మోడ్​ సెలక్టర్​, వయర్​లెస్​ ఛార్జింగ్​ పాడ్​ వంటివి లభిస్తున్నాయి. 360 డిగ్రీ వ్యూ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్‌పీ వంటివి స్టాండర్ట్‌గా వస్తున్నాయి. 30కేడబ్ల్యూహెచ్​- 40.5కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ వంటి ఆప్షన్స్​ ఉన్నాయి. వీటి రేంజ్​ వరుసగా 325కి.మీ, 465కి.మీ అని టాటా మోటర్స్ సంస్థ స్పష్టం చేసింది. ఈ వెహికల్ బుకింగ్స్ ఇండియాలో సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్నాయి.