Page Loader
Best Selling Car: డిసెంబర్ 2024లో అమ్ముడైన టాప్ కార్ల జాబితా.. మొదటి స్థానంలో ఏదంటే?
డిసెంబర్ 2024లో అమ్ముడైన టాప్ కార్ల జాబితా.. మొదటి స్థానంలో ఏదంటే?

Best Selling Car: డిసెంబర్ 2024లో అమ్ముడైన టాప్ కార్ల జాబితా.. మొదటి స్థానంలో ఏదంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా తాజాగా విడుదలైంది. ఇందులో మారుతీ సుజుకీ మళ్లీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మారుతీ సుజుకీ బ్రెజ్జా 17,336 యూనిట్ల విక్రయంతో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో ఇది స్విఫ్ట్, ఎర్టిగా, వ్యాగన్‌ఆర్ కార్లను వెనక్కి నెట్టింది. డిసెంబర్‌లో విక్రయించిన టాప్ 5 కార్లలో అన్ని కార్లూ 15,000 యూనిట్ల మార్కును దాటాయి. అయితే టాప్ 4 కార్లు మారుతీ సుజుకీకి చెందినవే. అందులో వ్యాగన్‌ఆర్ రెండో స్థానంలో స్విఫ్ట్ మూడో స్థానంలో, ఎర్టిగా నాలుగో స్థానంలో నిలిచాయి.

Details

వ్యాపారాన్ని విస్తృతం చేయాలని భావిస్తున్న మారుతీ సుజుకీ

అటు మారుతీ సుజుకీ ఇండియా తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో వాహన ఎగుమతులు చేసిన కంపెనీ, రానున్న సంవత్సరాల్లో వీటి సంఖ్యను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి విదేశీ ఎగుమతులను 8 లక్షల యూనిట్లకు పెంచాలని కంపెనీ లక్ష్యం తీసుకుంది. మూడేళ్ల క్రితం ఒక సంవత్సరానికి చేసే వాహన ఎగుమతులు 1 లక్ష యూనిట్ల నుంచి 1.2 లక్షల యూనిట్ల మధ్య ఉండేవని గతంలో మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి అన్నారు. కానీ ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిందన్నారు.

Details

8లక్షల యూనిట్లు చేరే అవకాశం

2022-23లో 2.59 లక్షల యూనిట్ల ఎగుమతులు 2023-24లో 2.83 లక్షల యూనిట్లకు చేరుకున్నాయన్నారు. అలాగే ఇతర కార్ల ఎగుమతులు 3 శాతం తగ్గినా, మారుతీ సుజుకీ మాత్రం 9.3 శాతం వృద్ధి చెందిందన్నారు. భారత్ నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేసిన కార్లలో 42 శాతం మారుతీ సుజుకీ వాహనాలు ఉండడం విశేషం. ఈ వృద్ధి ద్వారా, వచ్చే రెండు సంవత్సరాలలో వాహన ఎగుమతులు 3 లక్షల యూనిట్లకు పెరిగే అవకాశం ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య 8 లక్షల యూనిట్లను చేరుతుందని రాహుల్ భారతి తెలిపారు.