ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న వోల్వో C40 రీఛార్జ్ వచ్చేసింది.. నేడే లాంచ్!
వోల్వో ఇండియా C40 రిచార్జ్ ఈవీ గ్రాండ్‌గా భారత మార్కెట్లోకి రిలీజ్ అయింది. రెండోవ ఎలక్ట్రిక్ మోడల్ గా ఈ వెహికల్ ఇండియాలోకి అడుగుపెట్టింది. వోల్వో కార్స్ ఇండియా 2022లో XC40 రీఛార్జ్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వాస్తవానికి కంపెనీ 2025 నుండి ఎలక్ట్రిక్స్ వెహికల్స్ అందించాలని చూస్తోంది. వోల్వో XC40 మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మోడల్ పరిచయం చేసిన మొదటి ఐదు నెలల్లోనే 200 యూనిట్లను డెలివరీ చేయడం విశేషం. C40 రీఛార్జ్ పోల్చి చూస్తే దానికంటే ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వోల్వో C40 రీఛార్జ్, XC40 రీఛార్జ్ ఒకే మాదిరిగా ఉన్నా స్లీవ్‌లో అనేక ఏసెస్ ఉన్నాయి.
2025 నాటికి వోల్వోలో 50శాతం ఎలక్ట్రిక్ వాహనాలు
వోల్వో C40 రీఛార్జ్ EVలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. 600W డిజిటల్ యాంప్లిఫైయర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో కూడిన 13-స్పీకర్ హార్మన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. బాహ్య పరంగా, వోల్వో C40 రీఛార్జ్ EV మొత్తం LED లైటింగ్‌ను అందుకుంటుంది. 2025 నాటికి ప్రపంచంలోని మొత్తం వోల్వో కార్లలో దాదాపు 50 శాతం ఎలక్ట్రిక్‌తో ఉండనున్నాయి. రాబోయే రెండేళ్లలో కనీసం ఒక మిలియన్ EVలను ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యం పెట్టుకుంది.